News February 15, 2026

పుతిన్ యుద్ధానికి బానిస: జెలెన్‌స్కీ

image

రష్యా అధ్యక్షుడు పుతిన్ యుద్ధానికి బానిస అని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్‌స్కీ మండిపడ్డారు. తమ దేశంలో ప్రతి పవర్ ప్లాంటును రష్యా ధ్వంసం చేసిందని ఆరోపించారు. యుద్ధాన్ని ముగించేందుకు తాము చేయాల్సిందంతా చేస్తున్నామని చెప్పారు. హంగేరీ PM విక్టర్‌కు పొట్ట ఎలా పెంచుకోవాలో తెలుసని, రష్యా ట్యాంకులను ఆపడానికి సైన్యాన్ని ఎలా పెంచుకోవాలో తెలియదని మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్‌లో ఎద్దేవా చేశారు.

Similar News

News February 19, 2026

నేవీలో ఆఫీసర్ పోస్టులు.. పరీక్ష లేకుండానే..

image

260 ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఇండియన్ నేవీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే అకడమిక్ మెరిట్, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేయనుంది. పోస్టును బట్టి డిగ్రీ, ఇంజినీరింగ్‌, పీజీతోపాటు శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. అవివాహితులు మాత్రమే అర్హులు. జీతం ₹1.25-1.5 లక్షలు. ఈ నెల 24 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు వెబ్‌సైట్: https://www.joinindiannavy.gov.in/

News February 19, 2026

శ్రీలంకకు ఎదురుదెబ్బ.. స్టార్ ప్లేయర్ ఔట్

image

T20 WC సూపర్-8కు ముందు శ్రీలంకకు ఎదురుదెబ్బ తగిలింది. బౌలర్ మతీశ పతిరణ టోర్నీ మొత్తానికి దూరమయ్యారు. ఈ నెల 16న ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో తొడ కండరాలు పట్టేయడంతో మైదానాన్ని వీడారు. అతడు కోలుకోవడానికి 4-5 వారాలు పట్టే అవకాశం ఉందని వైద్యులు చెప్పారు. దీంతో దిల్షాన్ మధుశంకను జట్టులోకి తీసుకున్నారు. మరోవైపు IPLలోనూ పతిరణ ఆడటం డౌటేనని తెలుస్తోంది. అతడిని KKR ₹18 కోట్లకు <<18581979>>కొనుగోలు<<>> చేసింది.

News February 19, 2026

ఇలా పడుకుంటే మొటిమల ముప్పు

image

సాధారణంగా మన చర్మం విడుదల చేసే నూనెలు, చెమట, బ్యాక్టీరియాతో పాటు మృతకణాలూ దిండు పైకి చేరతాయి. దిండు కవర్లను తరచూ మార్చకపోతే మొటిమల ముప్పు ఉంటుంది. అలాగే మేకప్ తొలగించకపోవడం, బోర్లా పడుకోవడం, గదిలో ఉష్ణోగ్రత, హ్యుమిడిటీ ఎక్కువగా ఉండటం వల్ల కూడా చర్మం ఎక్కువ సీబమ్‌ను ఉత్పత్తి చేసి మొటిమలకు కారణమవుతాయి. కాబట్టి బెడ్‌రూంను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు.