News June 4, 2024

పుత్తా చైతన్య రెడ్డి విజయం

image

కమలాపురం నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పుత్తా చైతన్య రెడ్డి విజయం సాధించారు. ఈయనకు 93898 ఓట్లు పోలవ్వగా.. ఆయన ప్రత్యర్థి పి.రవీంద్రనాథ్ రెడ్డికి 69244 ఓట్లు వచ్చాయి. దీంతో పుత్తా 24654 ఓట్ల మెజార్టీతో గెలిచారు. దీంతో ఆయన మెదటి సారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అసెంబ్లీలో అడుగుపెడుతున్నారు.
NOTE: పోస్టల్ బ్యాలెట్ కలపకుండా

Similar News

News January 2, 2025

ఇడుపులపాయ: IIIT విద్యార్థులకు సంక్రాంతి సెలవులు ఎప్పుడంటే.!

image

కడప జిల్లా వేంపల్లి మండలంలోని ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ IIIT విద్యార్థులకు ఈనెల 11వ తేదీ నుంచి 19వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించినట్లు, ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ గుప్తా తెలిపారు. గురువారం స్థానిక ట్రిపుల్ ఐటీలో ఆయన మాట్లాడుతూ.. సంక్రాంతి పండుగ సందర్భంగా విద్యార్థులకు వారం రోజులపాటు సెలవులను ప్రకటించామన్నారు.

News January 2, 2025

కడప పట్టణాన్ని నిర్మించిన రాజు మీకు తెలుసా?

image

దక్షిణ భారతదేశంలో అతి ప్రాచీనమైన పట్టణాలలో కడప పట్టణం ఒకటి. పెన్నా నది ఒడ్డున మొదటి కడప పట్టణాన్ని తమిళ రాజు కరికాల చోళుడు నిర్మించినట్లు తమిళ సంఘ సాహిత్యంలోని తల్కాపియం అనే గ్రంథం ఆధారంగా తెలుస్తుంది. కరికాల చోళుని పేరు మీదనే కడప అనే పేరు వచ్చింది. అప్పటి జిల్లా ప్రధాన పరిపాలనా కేంద్రం సిద్ధపటం కోట. ఈ కోట కూడా పెన్నా నది ఒడ్డునే ఉండడం విశేషం. కంచి ఏకాంబరేశ్వరబాబు ఆలయంలో వీరి విగ్రహం ఉంది.

News January 2, 2025

కడప జిల్లాలో రూ.14 కోట్ల మద్యం తాగేశారు

image

నూతన సంవత్సరానికి మందు బాబులు ఫుల్ కిక్‌తో స్వాగతం పలికారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని కడప జిల్లాలో డిసెంబర్ 30, 31 జనవరి 1న రూ.14,51,06,769 మద్యాన్ని మందు బాబులు తాగేశారు. వీటిలో లిక్కర్ 18,586 కేసులు, బీర్లు 8586 కేసులు అమ్మకాలు జరిగాయని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ రవికుమార్ తెలిపారు.