News September 13, 2025

పుత్తూరులో రోడ్డు ప్రమాదం.. ఒకరి స్పాట్ డెడ్

image

పుత్తూరు పట్టణంలోని పరమేశ్వరమంగళం KKC కళాశాల సమీపంలో శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చెన్నై వైపు వెళ్తున్న లారీ అతివేగంగా బైకును ఢీకొట్టింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనదారుడు సతీశ్ అరక్కోణం మృతి చెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. మృతి చెందిన సతీశ్, ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Similar News

News September 13, 2025

అనకాపల్లి: కుప్పలుగా పడి ఉన్న చనిపోయిన కోళ్లు

image

అనకాపల్లి జిల్లాలోని పలు ప్రాంతాల్లో చనిపోయిన బాయిలర్ కోళ్లు దర్శనమిస్తున్నాయి. దేవరాపల్లి మండలం మారేపల్లి శివారు చేనులపాలెం వద్ద రైవాడ కాలువతోపాటు చెరువుల్లో శనివారం చనిపోయిక కోళ్లు కనిపించాయి. పరిసర ప్రాంతాల్లో పౌల్ట్రీ యజమానులు చనిపోయిన వందలాది కోళ్ళను రాత్రి సమయంలో కాలువల్లో వేసి వెళ్లిపోతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు నిఘా పెట్టాలని కోరుతున్నారు.

News September 13, 2025

సిద్దిపేట: చేనుకు చావు.. రైతుకు దుఃఖం

image

జిల్లాలో యూరియా కొరత రైతులను తీవ్రంగా వేధిస్తుంది. ముఖ్యంగా మొక్కజొన్నకు యూరియా చల్లే అదను దాటిపోవడంతో పంట ఎదగక పోవడం కళ్లముందే పంటనాశనం కావడం రైతులను కుంగదీస్తుంది. ఇప్పుడు యూరియా లభించి పోసినా లాభం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. దుబ్బాక నియోజకవర్గం అప్పాయిపల్లికి చెందిన రైతు బాలయ్య, హుస్నాబాద్ మండలం మీర్జాపూర్‌కు చెందిన రైతు శ్రీకాంత్ మొక్కజొన్న పంటలో పశువులను కట్టేసి మేపుతూ ఆవేదన చెందారు.

News September 13, 2025

సిద్దిపేట: నిరుద్యోగులను మోసం చేసిన సీఎం: హరీశ్ రావు

image

రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి నిరుద్యోగులను మోసం చేశారని ఎమ్మెల్యే హరీశ్ రావు ఆరోపించారు. శనివారం సిద్దిపేటలో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు ఆయన హాజరై మాట్లాడారు. నిరుద్యోగుల పక్షాన పోరాటం చేస్తామని, అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. గ్రూప్-1 పరీక్షల అవకతవకలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్నారు.