News April 16, 2024
పుత్తూరు: టీడీపీలో చేరిన ఎమ్మెల్యే అల్లుడు

నగరి నియోజకవర్గంలో వైసీపీకి మరో షాక్ తగిలింది. సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అల్లుడు, పుత్తూరు పట్టణ 11వ వార్డు వైసీపీ కౌన్సిలర్ జాన్ కెనడీ టీడీపీ గూటికి చేరారు. ఆయనకు నగరి ఎమ్మెల్యే అభ్యర్థి గాలి భాను ప్రకాశ్ పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కెనడీతో పాటు ఆయన అనుచరులు కూడా వైసీపీని వీడారు. కోనేటి ఆదిమూలం కూడా వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచి టీడీపీలో చేరడం విశేషం.
Similar News
News April 23, 2025
టెన్త్ ఫలితాలు: 6 నుంచి 24వ స్థానానికి చిత్తూరు జిల్లా

ఈ ఏడాది 10వ తరగతి ఫలితాల్లో చిత్తూరు జిల్లాలో ఉత్తీర్ణత శాతం తీవ్ర నిరాశకు గురి చేసింది. గతేడాది టెన్త్ ఫలితాల్లో చిత్తూరు జిల్లా 91.28% ఉత్తీర్ణతతో 6వ స్థానంలో నిలవగా, ఈ ఏడాది 67.06 శాతంతో 24వ స్థానంలో నిలిచింది. ఏడాది వ్యవధిలో దాదాపు 18 స్థానాలు దిగజారడంపై పలువురు అసహనం వ్యక్తం చేశారు.
News April 23, 2025
టెన్త్ ఫలితాల్లో 24వ స్థానంలో చిత్తూరు జిల్లా

తాజా టెన్త్ ఫలితాల్లో చిత్తూరు జిల్లా 24వ స్థానంలో నిలించింది. మొత్తం 20,796 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 13,946 మంది పాస్ అయ్యారు. 10,723 మంది అబ్బాయిలకుగాను 6,573 మంది, అమ్మాయిలు 10,073 మందికిగాను 7,373 మంది పాస్ అయ్యారు. కాగా 67.06 శాతం ఉత్తీర్ణత నమోదైంది.
News April 23, 2025
సివిల్స్‌లో మెరిసిన పలమనేరు వాసి

UPSC తుది ఫలితాలలో చిత్తూరు జిల్లా వాసి సత్తా చాటాడు. పలమనేరుకు చెందిన రంపం శ్రీకాంత్ మంగళవారం వెలువడిన సివిల్స్ ఫలితాల్లో 904వ ర్యాంకు సాధించాడు. శ్రీకాంత్ ఎలాంటి కోచింగ్ లేకుండా ఈ ఘనత సాధించడంతో జిల్లా వాసులు అతనికి అభినందనలు తెలిపారు.