News January 8, 2026
పున్నమి ఘాట్‌లో ఘనంగా నదీ హారతి

భవానిపురం పున్నమిఘాట్‌కు CM చంద్రబాబు గురువారం విచ్చేశారు. యూరోపియన్ యూనియన్ అంబాసిడర్ హెర్వే డెల్ఫిన్‌తో కలిసి ఆయన ‘శ్రీ కృష్ణవేణి నది హారతి’ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి కందుల దుర్గేశ్, ఉన్నతాధికారులు సీఎంకు ఘనస్వాగతం పలికారు. పర్యాటక రంగం అభివృద్ధిలో భాగంగా నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలను సందర్శించి, సాంస్కృతిక ప్రదర్శనలను తిలకించారు. నదీ తీరంలో ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడింది.
Similar News
News February 17, 2026
HYD: ఆఫీసే నయం.. ఇంటికి వెళ్లాలంటేనే భయం!

‘బాస్ పిలుస్తాడని కాదు.. ఇంటికెళ్తే వచ్చే తలనొప్పి భరించలేక’ ఇదీ నేటి యూత్ మైండ్‌సెట్. ఆఫీసు పని ఒత్తిడి, టార్గెట్ ఒక ఎత్తైతే, ఇంటికి వెళ్లాక ల్యాప్‌టాప్ వదలని ‘ఆల్వేస్ అవైలబుల్’ కల్చర్ యువతను నిలువునా దహించేస్తోంది. అందుకే ఇంటికెళ్లి ఆ గందరగోళంలో పడేకంటే, ఆఫీసులోనే కాసేపు ఎక్కువ గడిపి ఆ ప్రశాంతతను వెతుక్కుంటున్నారు. పని నుంచి తప్పించుకోవడానికి కాదు, మానసిక ప్రశాంతత కోసమే ఈ లేట్ నైట్ తిప్పలు!

నైట్ షాపింగ్‌కు ముస్తాబవుతున్న హైదరాబాద్

మరో 3రోజుల్లో రంజాన్ మాసం ప్రారంభం కానుండటంతో పాతబస్తీలో సందడి మొదలైంది. ఈ నెల 19 నుంచి ఉపవాస దీక్షలు ప్రారంభమయ్యే అవకాశముండటంతో చార్మినార్ పరిసరాల్లో వ్యాపారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. నెల రోజుల పాటు కొనసాగే నైట్ షాపింగ్‌తో పాటు, నోట్లో కరిగిపోయే హలీం రుచులను ఆస్వాదించేందుకు నగరవాసులు భారీగా తరలిరానున్నారు. దీంతో ఓల్డ్ సిటీ సరికొత్త వెలుగులతో కళకళలాడుతోంది.