News April 8, 2025
‘పురమిత్ర యాప్‌తో కర్నూలు నగర సేవలు’

రాష్ట్ర ప్రభుత్వం నగరాల్లో, పట్టణాల్లో స్థానిక సంస్థల సేవలను పౌరులకు సులువుగా అందించేందుకు వీలుగా రూపొందించిన ‘పురమిత్ర’ యాప్‌ను నగర ప్రజలు డౌన్లోడ్ చేసుకుని నగరపాలక సంస్థ సేవలను సులువుగా పొందాలని నగరపాలక అదనపు కమిషనర్ ఆర్జీవీ కృష్ణ మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, వీధి దీపాలు, పార్కుల్లో పరికరాలు, రహదారుల మరమ్మత్తులపై ఫిర్యాదులు చేయవచ్చని తెలిపారు.
Similar News
News January 29, 2026
డీసీసీబీ సేవలపై కలెక్టర్ సమీక్ష

కర్నూలు కలెక్టర్ కార్యాలయంలో గురువారం కేడీసీసీ బ్యాంక్ జిల్లా స్థాయి అమలు, పర్యవేక్షణ కమిటీ సమావేశం జరిగింది. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో రైతులకు అందుతున్న రుణాలు, పథకాల అమలు, రికవరీ స్థితిగతులపై చర్చించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం లబ్ధిదారులకు నాణ్యమైన సేవలు సకాలంలో అందేలా చూడాలని ఆమె అధికారులను ఆదేశించారు. బ్యాంక్ సేవల మెరుగుదలకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
News January 29, 2026
కర్నూలు కలెక్టరేట్ నుంచి హెల్మెట్ అవగాహన ర్యాలీ

హెల్మెట్ ధరించి ప్రాణాలను కాపాడుకోవాలని కర్నూలు జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి పిలుపునిచ్చారు. గురువారం కలెక్టరేట్ నుంచి ఎస్పీ విక్రాంత్ పాటిల్‌తో కలిసి ఆమె అవగాహన ర్యాలీని ప్రారంభించారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. కలెక్టరేట్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ రాజ్ విహార్ సెంటర్ వరకు కొనసాగి ముగిసింది. రోడ్డు భద్రతపై ప్రజల్లో చైతన్యం తేవడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని వారు పేర్కొన్నారు.
News January 28, 2026
రెండో రోజు కొనసాగిన ఇంటర్ ప్రాక్టికల్స్

కర్నూలు జిల్లా వ్యాప్తంగా 2వ రోజు ఇంటర్మీడియట్ ఒకేషనల్ ప్రాక్టికల్ పరీక్షలు కొనసాగాయి. పరీక్షల వివరాలను బుధవారం ఇంటర్ బోర్డు ప్రాంతీయ అధికారి లాలప్ప వెల్లడించారు. ప్రథమ సంవత్సరంలో 1,313 మందికి గాను 1,239 మంది హాజరవ్వగా.. 74 మంది గైర్హాజరయ్యారన్నారు. ద్వితీయ సంవత్సరంలో 1,081 మందికి గాను 1,064 మంది పరీక్ష రాశారని, 17 మంది హాజరు కాలేదని పేర్కొన్నారు.


