News April 9, 2025
పురమిత్ర యాప్ ద్వారా సేవలు పొందండి: మౌర్య

రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రారంభించిన ‘పురమిత్ర’ యాప్ ద్వారా ప్రజలు మునిసిపల్ సేవలు పొందవచ్చని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య మంగళవారం తెలిపారు. ప్రజలు కార్యాలయాలు చుట్టూ తిరిగే పనిలేకుండా మున్సిపల్ సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పురమిత్ర యాప్‌ను రూపొందించిందన్నారు.
Similar News
News December 26, 2025
చిత్తూరు: ఉపాధి రికవరీ బకాయిలు రూ. 1.59 కోట్లు

చిత్తూరు జిల్లాలో ఉపాధి హామీ పథకంలో సోషల్ ఆడిట్ తనిఖీ రికవరీలో ఇంకా రూ. 1.59 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. ఐదేళ్లలో సోషల్ ఆడిట్లో రూ. 4.85 కోట్ల మేర అవినీతి జరిగినట్టు అధికారులు గుర్తించారు. దీనిని రికవరీ చేయాలని ఆదేశించగా ఇప్పటివరకు రూ. 3.26 కోట్లను వసూలు చేశారు. రికవరీకి చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.
News December 26, 2025
అనకాపల్లి: బొజ్జన కొండ.. ఆహ్లాదమే మది నిండా

తుంపాల మండలం శంకరంలోని బొజ్జన కొండకు పర్యాటకుల తాకిడి పెరుగుతోంది. ఇక్కడ బౌద్ధులు చెక్కిన శిల్పాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. గుహలు, స్తూపాలు, బుద్ధుడి విగ్రహాలు, కట్టడాలు ఆశ్చర్యగొలుపుతున్నాయి. గతంలో మౌలిక సదుపాయాల కొరత వల్ల ప్రజలు ఆసక్తి చూపేవారు కాదు. ప్రస్తుతం సుందరంగా తీర్చిదిద్దడంతో చుట్టుపక్కల జిల్లాలవారూ వస్తున్నారు. కొండ ముందు ఉండే శారదా నది కాలువ దీనికి మరింత సొబగును అద్దుతోంది.
News December 26, 2025
HYD: దారుణం.. భార్యపై పెట్రోల్ పోసి నిప్పటించిన భర్త

నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు వివరాలు.. భార్యపై అనుమానంతో వెంకటేశ్ తన భార్య త్రివేణిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. కుమారుడిని ఇంటి బయటకు తీసుకెళ్లి త్రివేణిని దహనం చేసి వెంకటేశ్ పరారయ్యాడు. మంటల్లో త్రివేణి దహనం అయ్యింది. పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న వెంకటేశ్ కోసం గాలింపు చేపట్టారు.


