News March 30, 2024
పురిగడ్డలో 3వ శతాబ్ధం నాటి శాసన సహిత శిల

చల్లపల్లి మండలం పురిగడ్డ గ్రామంలో 30న పోతురాజు, గంగానమ్మ విగ్రహాల పునః ప్రతిష్ఠ వైభవంగా జరగనుంది. ప్రతిష్ఠ నిమిత్తం పోతురాజు శిలను శుభ్రం చేస్తుండగా ఆ శిల ప్రాచీన వైభవం బయటపడింది. పోతురాజు రూపంలో ఉన్న ఆ శిల 3వ శాతాబ్ధం నాటి ఇక్ష్వాకుల శిలాగా గుర్తించారు. ఈ శిలకు ఆనంద అనే బౌద్ధ గురువు విరాళం ఇచ్చినట్లు చెక్కి ఉందని బెంగళూరు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాసన విభగం డైరెక్టర్ మునిరత్నం చెప్పారు.
Similar News
News April 14, 2026
అగ్ని ప్రమాదాలపై అప్రమత్తత అవసరం: కలెక్టర్

అగ్ని ప్రమాదాల నివారణపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ డీకే బాలాజీ సూచించారు. మచిలీపట్నంలోని ఫైర్ స్టేషన్‌లో మంగళవారం ఆయన అగ్నిమాపక వారోత్సవాలను ప్రారంభించి, గోడ పత్రికలను ఆవిష్కరించారు. ప్రమాదాల నివారణకు వాడే వివిధ పరికరాలను కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించారు. వారం రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమాల ద్వారా ప్రజలను చైతన్యపరచాలని ఆయన అధికారులను ఆదేశించారు.
News April 14, 2026
కృష్ణా: అంబేడ్కర్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం ఎక్కడ?

మచిలీపట్నం కోర్టు రోడ్డులోని అంబేడ్కర్ భవన్ శిథిలావస్థకు చేరినప్పటికీ, నూతన కమ్యూనిటీ హాల్ నిర్మాణం అడుగు ముందుకు పడటం లేదు. గతంలో రూ.5కోట్ల నిధులతో నిర్మిస్తామని హామీలు ఇచ్చినా, రాజకీయ వైషమ్యాల వల్ల అది సాధ్యపడలేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు గడుస్తున్నా.. అటు MP బాలశౌరి, ఇటు మంత్రి కోళ్లు రవీంద్ర మధ్య సఖ్యత లేకపోవడం వల్లే నిర్మాణం నిలిచిపోయిందనే ఆరోపణలు వస్తున్నాయి.
News April 14, 2026
కృష్ణా: పీజీఆర్ఎస్‌కు 132 అర్జీలు

పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని సోమవారం మచిలీపట్నం కలెక్టరేట్‌లో నిర్వహించారు. ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో కలెక్టర్ డీకే బాలాజీ, జాయింట్ కలెక్టర్ నవీన్‌కు అందించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 132 అర్జీలు అందినట్టు అధికారులు తెలిపారు. శాఖల వారీగా అర్జీలను విభజించి ఆయా శాఖల అధికారులకు పరిష్కారం నిమిత్తం బదిలీ చేశామన్నారు.


