News February 23, 2026

పురుషులు మొలతాడు ఎందుకు కట్టుకోవాలి?

image

మొలతాడును ఓ సంప్రదాయమే అనుకుంటే పొరపాటే! దీని వెనుక ఆరోగ్య రహస్యాలున్నాయి. పిల్లల్లో హెర్నియా సమస్యలు రాకుండా ఇది రక్షణగా నిలుస్తుంది. శరీరంలో వచ్చే మార్పులను, పొట్ట పెరుగుదలను హెచ్చరిస్తుంది. పూర్వం గోచి ధరించడానికి ఇది ప్రధానాధారం. సామాజికంగా ‘మొలతాడు కట్టిన మగాడివైతే’ అనే సవాలు ఆ వ్యక్తి వివాహానికి అర్హుడైన పురుషుడనే గుర్తింపును సూచిస్తుంది. స్త్రీలకు కూడా చిన్నతనంలో మొలనూలు ధరించే ఆచారం ఉంది.

Similar News

News February 23, 2026

విద్యార్థులకు అలర్ట్.. ఏప్రిల్ 10 నుంచి ఎగ్జామ్స్

image

TG: ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు సమ్మెటివ్ అసెస్‌మెంట్-2 వార్షిక పరీక్షలు ఏప్రిల్ 10 నుంచి ప్రారంభం కానున్నాయి. అదే నెల 20న ఎగ్జామ్స్ ముగుస్తాయి. సమాధాన పత్రాలను ఏ రోజుకారోజు మూల్యాంకనం చేసి విద్యార్థుల మార్కులను ISMS పోర్టల్‌లో నమోదు చేయనున్నారు. ఓవరాల్‌గా 23న ఫలితాలు విడుదల చేస్తారు. అదే రోజు బడుల్లో పేరెంట్స్ మీటింగ్ నిర్వహిస్తారు. 24 నుంచి వేసవి సెలవులు ఉంటాయి.

News February 23, 2026

అపరాల పంటల్లో తెల్లదోమ.. నివారణ ఎలా?

image

తెల్లదోమ అపరాల పంట ఆకుల అడుగు భాగం నుంచి రసం పీల్చడం వల్ల మొక్కలు పాలిపోయి నల్లగా కనబడతాయి. అంతేకాకుండా ఎల్లో మొజాయిక్ (పల్లాకు తెగులు) అనే వైరస్ వ్యాధిని కూడా వ్యాపింపజేస్తాయి. పల్లాకు తెగులు సోకిన మొక్కలను తొలి దశలోనే గుర్తించి కాల్చివేయాలి. తెల్లదోమ నివారణకు పొలంలో ఎకరానికి 20-25 పసుపు రంగు జిగురు అట్టలను అమర్చాలి. లీటరు నీటికి 5 శాతం వేపగింజల కషాయం లేదా వేపనూనె 5ml కలిపి పిచికారీ చేయాలి.

News February 23, 2026

సీనియర్ హీరోయిన్ వెయిట్‌లాస్ సీక్రెట్ ఇదే..

image

సీనియర్ నటి ఖుష్బూ సుందర్ ఇటీవల తన వెయిట్‌లాస్‌తో అందరి దృష్టినీ ఆకర్షించారు. అయితే స్ట్రిక్ట్ డైట్, రెండు పూటలా వ్యాయామం చేయడమే తన ఫిట్‌నెస్ సీక్రెట్ అని ఆమె తాజాగా వెల్లడించారు. 54ఏళ్ల వయసులో 20 కేజీల బరువు తగ్గిన ఆమె.. ఫిట్‌నెస్ సాధించాలంటే క్రమశిక్షణ, స్థిరత్వం ఉండాలని సూచించారు. ఇలా ఆరోగ్యకరంగా బరువు తగ్గి ఎందరికో ఆదర్శంగా నిలిచారామె.