News February 3, 2025
పులివెందులలో అరటికాయల వ్యాపారి హత్య
పులివెందుల పట్టణం స్థానిక బిఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద ఆదివారం రాత్రి అరటికాయల మోహన్‌పై కొంతమంది దాడి చేయడంతో మృతి చెందాడు. స్థానికుల కథనం మేరకు.. అరటికాయల వ్యాపారి రూ.2 వేలు అప్పు చెల్లించలేదనే నెపంతో కొంతమంది దాడి చేసినట్లు తెలుస్తోంది. అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ వ్యాపారి మృతి చెందినట్లు తెలిసింది.
Similar News
News February 3, 2025
గజ వాహనంపై భక్తులకు కడప రాయుడి దర్శనం
తిరుమలకు తొలిగడప దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఈరోజు సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారిని గజవాహనంపై అలంకరించి నాలుగు మాడవీధుల్లో విహారం చేశారు. నేడు స్వామివారి కల్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించగా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రేపు రథంపై శ్రీవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
News February 3, 2025
కడప: YVU పీజీ పరీక్షా ఫలితాలు విడుదల
వైవీయూ, అనుబంధ కళాశాలల ఎమ్మెస్సీ, ఎంఏ, ఎంకాం మూడో సెమిస్టర్ పరీక్షలలో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారని వీసీ ఆచార్య కె. కృష్ణారెడ్డి అన్నారు. సోమవారం తమ చాంబరులో రిజిస్ట్రార్ ప్రొ పి.పద్మ, సీఈ ప్రొ కెఎస్వీ కృష్ణారావుతో కలిసి పీజీ పరీక్షా ఫలితాలను విడుదల చేశారు. ఫలితాల కోసం https:www.yvuexams.in/results.aspx అనే వెబ్‌సైట్‌ను సందర్శించాలన్నారు. ఏసీఈలు డా.మమత, డా.శ్రీనివాసులు పాల్గొన్నారు.
News February 3, 2025
ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి: ఎస్పీ
ప్రజలు ఇచ్చే ఫిర్యాదులను సత్వరమే విచారించి పరిష్కరించాలని కడప జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి ఎస్పీ ఫిర్యాదులు స్వీకరించారు. వెంటనే సంబంధిత అధికారులకు బదిలీ చేస్తూ తగిన సమయంలో విచారించి న్యాయం చేయాలన్నారు.