News April 17, 2024

పులివెందుల: టన్ను చీనీ ధర రూ. 40 వేలు

image

పులివెందుల వ్యవసాయ చీనీ మార్కెట్లో చీనీ కాయల ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. రెండు రోజుల వ్యవధిలోనే టన్ను ధర రూ.35 వేల నుంచి రూ.40 వేలు పలకడంతో చీనీ సాగు చేసిన రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. లింగాల, సింహాద్రిపురం, తొండూరు, వేముల, పులివెందుల మండలాల్లోని పలు గ్రామాల నుంచి మంగళవారం ఒక్కరోజే 650 టన్నుల చీనీ కాయలు పులివెందుల చీనీ మార్కెట్‌కు వచ్చినట్లు నిర్వహకులు తెలిపారు.

Similar News

News January 6, 2026

కడప జిల్లాలో ఉల్లి రైతులకు రూ.28.40 కోట్ల సాయం.!

image

కడప జిల్లాలో 7298 మంది ఉల్లి రైతులకు 14,203.31 ఎకరాలకు రూ.28.40 కోట్లు ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం విడుదల చేసింది.
*కమలాపురం 2526 మందికి రూ.11.32 కోట్లు
*మైదుకూరు 2352 మందికి రూ.7.74 కోట్లు
*పులివెందుల 1590 మందికి రూ.6.17 కోట్లు
*జమ్మలమడుగు 742 మందికి రూ.2.99 కోట్లు
*బద్వేల్ 67మందికి రూ.14.92 లక్షలు
*రాజంపేట 18మందికి రూ.2.33 లక్షలు
*కడప ఇద్దరికి రూ.35,900
*ప్రొద్దుటూరులో ఒకరికి రూ.20.60 వేలు.

News January 6, 2026

2వ సెట్‌ను కూడా కైవసం చేసుకున్న ఏపీ టీం

image

ఇవాళ జాతీయ స్థాయి U-14 బాలికల వాలీబాల్ లీగ్ మ్యాచ్‌లో ఏపీ టీం ఒడిశా టీంతో పోటీ పడుతోంది. రెండో సెట్లోనూ ఏపీ టీం విజయం సాధించింది. <<18778904>>మొదటి<<>> సెట్లోనే విజయం సాధించడంతో 2-0 తో ముందంజలో ఉంది. <<18777301>>LIVE<<>> ను కూడా మీరు Way2News లో చూడవచ్చు.

News January 6, 2026

జమ్మలమడుగు: సెట్ 1 కైవసం చేసుకున్న ఏపీ టీం

image

ఇవాళ జాతీయ స్థాయి U-14 బాలికల వాలీబాల్ లీగ్ మ్యాచ్‌లో ఏపీ టీం ఒడిశా టీంతో పోటీ పడుతోంది. మొదటి సెట్లో ఏపీ విజయం సాధించింది. ప్రస్తుతం రెండో సెట్ జరుగుతోంది. రెండో సెట్‌లోనూ భారీ వ్యత్యాసంతో ఏపీ టీం దూసుకుపోతోంది. మొత్తం 5 సెట్లు జరుగుతాయి. <<18777301>>LIVE<<>> ను కూడా మీరు Way2News లో చూడవచ్చు.