News April 9, 2025
పులివెందుల: MLC V/S మాజీ MLC

కడప జిల్లాలో TDPని బలోపేతం చేయాలనే ఆ పార్టీ పెద్దల ఆకాంక్ష.. స్థానిక నేతల వర్గపోరుతో తీరేలా కనిపించడం లేదు. ఈ మధ్య కాలంలో మాజీ MLC బీటెక్ రవి, MLC రాంగోపాల్ రెడ్డి వర్గీయుల మధ్య ఆధిపత్యం తారాస్థాయికి చేరుకుంది. ఇటీవల వీరి వర్గీయులు ఘర్షణలకు దిగారు. మంగళవారం జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి సవిత ఎదుటే ఒకరిపై ఒకరు బాహాబాహికి దిగారు. దీంతో జిల్లా TDP సీనియర్ నేతలు తలలు పట్టుకుంటున్నారు.
Similar News
News April 17, 2025
ప్రొద్దుటూరులో ఒకేరోజు 60 తులాల బంగారం చోరీ.. 18 కేజీల పసిడి పట్టివేత

కడప జిల్లా ప్రొద్దుటూరులో ఒకేరోజు రెండు సంఘటనలు జరిగాయి. స్థానిక బొల్లవరం నరాల బాలిరెడ్డి కాలనీలో యెనమల చంద్రశేఖర్ రెడ్డి ఇంట్లో కుటుంబ సభ్యులెవ్వరూ లేని సమయంలో 60 తులాల బంగారం చోరీ జరిగింది. మరోవైపున స్థానిక రామేశ్వరం బైపాస్ రోడ్డులో వాహన తనిఖీల్లో పోలీసులు ఒక కారులో రికార్డులు లేని 18 కేజీల బంగారు ఆభరణాలను పట్టుకున్నారు.
News April 17, 2025
కడప జిల్లా లెక్చరర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎన్నిక

కొండాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్న జి.రామకృష్ణారెడ్డి కడప జిల్లా లెక్చరర్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. కడప పట్టణంలోని STUAP భవనంలో రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం గురువారం ఎన్నుకున్నారు. ఈ సందర్బంగా కొండాపురం కళాశాలలో పనిచేస్తున్న లెక్చరర్‌లు జయాకర్, రవికుమార్, మహబూబ్ బాషా, వేణుగోపాల్, ప్రిన్సిపల్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
News April 17, 2025
కడప: 2 టౌన్ పోలీస్ స్టేషన్‌లో యువకుడి ఆత్మహత్య?

కడప 2 టౌన్ పోలీస్ స్టేషన్‌లో గత అర్ధరాత్రి యువకుడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గంజాయి కేసులో నాకాశ్‌కు చెందిన సోనూ అలియాస్ పాండు అనే యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. గత రాత్రి బాత్ రూమ్‌కి వెళ్ళి చొక్కా గ్రిల్‌కు వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.