News October 24, 2025
పుల్కల్: హత్య కేసులో ఇద్దరికీ జీవిత ఖైదు

హత్య కేసులో ఇద్దరు నిందితులకు జైలు శిక్ష విధిస్తూ రెండవ అదనపు జిల్లా సెషన్స్ న్యాయమూర్తి డాక్టర్ పీపీ కృష్ణ అర్జున్ గురువారం తీర్పు ఇచ్చారు. పుల్కల్ మండలం ఇసోజి పేట గ్రామానికి చెందిన ఓ గృహిణిని ఇద్దరూ కలిసి 2019లో హత్య చేశారు. నేరం రుజువు కావడంతో ఇద్దరికీ జైలు శిక్ష విధించినట్లు ఎస్పీ పారితోష్ పంకజ్ తెలిపారు.
Similar News
News October 24, 2025
శ్రీ సత్యసాయి జిల్లాలో 560.8 మి.మీ వర్షపాతం నమోదు

శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు 560.8 మి.మీ వర్షపాతం నమోదైనట్లు కలెక్టర్ కార్యాలయ సిబ్బంది తెలిపారు. అత్యధికంగా ముదిగుబ్బ మండలంలో 80.2 మి.మీ నమోదు కాగా, అత్యల్పంగా అగళిలో 2.4 మి.మీ వర్షపాతం నమోదైందన్నారు. తాడిమర్రి 49.2, బత్తలపల్లి 46.6, నల్లమాడ 43.4, కదిరి 41.8, ధర్మవరం 33.6, తనకల్లులో 27.2 మి.మీ వర్షం పడినట్లు చెప్పారు.
News October 24, 2025
ప్రభుత్వం పంపిన ప్రశ్నాపత్రాలే వాడాలి: డీఈవో

నల్గొండ జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలల్లో ప్రభుత్వం పంపిన ప్రశ్నాపత్రాలతోనే విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలని డీఈఓ భిక్షపతి ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం నుంచి ఈనెల 31 వరకు ఎస్ఏ-1 పరీక్షలను నిర్దేశించిన కాలనిర్ణయం పట్టిక ప్రకారం నిర్వహించాలని పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
News October 24, 2025
ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్ పరీక్షలు.. ఇవాళ షెడ్యూల్!

TG: ఇంటర్ బోర్డు పరీక్షలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 25 నుంచి నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ముందుగా 23 నుంచే నిర్వహించాలని అధికారులు భావించారు. అయితే గత 13 ఏళ్లుగా బుధవారం రోజే పరీక్షలు మొదలవడంతో అదే సెంటిమెంట్ దృష్ట్యా 25 నుంచి నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇవాళ షెడ్యూల్ రిలీజ్ కానున్నట్లు బోర్డు వర్గాలు తెలిపాయి. కాగా ఏపీలో ఫిబ్రవరి 23 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.


