News February 13, 2026

పుల్లంపేట: హాస్టల్‌ను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్

image

పుల్లంపేట మండలంలోని సాంఘిక వెనుకబడిన తరగతుల సంక్షేమ బాలుర వసతి గృహాన్ని తిరుపతి కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ గురువారం ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. విద్యార్థులతో స్వయంగా మాట్లాడి సమస్యలపై అడిగి తెలుసుకున్నాను. వంటగది, బాత్రూంలో, వాటర్ ప్లాంట్, వాషింగ్ మెషీన్ సదుపాయాలను పరీక్షించి పరిశుభ్రతపై అధికారులకు సూచనలు చేశారు.

Similar News

News February 17, 2026

సిరిసిల్ల: ‘పెద్దపులి’ పంజా.. లేగదూడ మృతి

image

ఇల్లంతకుంట మండలంలోని తిప్పాపూర్ గ్రామంలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. పొలం వద్ద కట్టేసిన మూడు లేగదూడలపై అర్ధరాత్రి సమయంలో పెద్దపులి దాడి చేసిందని గ్రామస్థులు తెలిపారు. ఈ దాడిలో రైతు సుధాకర్‌కు చెందిన లేగదూడ మృతి చెందింది. వారం రోజులుగా మండలంలో పులి సంచరిస్తుండటంతో పొలాల వద్దకు వెళ్లే రైతులు, గొర్రెల కాపరులు ఒంటరిగా వెళ్లకూడదని, అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు సూచించారు.

News February 17, 2026

విశాఖలో పర్యాటక ప్రాంతాల పాక్షిక మూసివేత

image

అంతర్జాతీయ నౌకాదళ (IFR-2026) విన్యాసాల దృష్ట్యా విశాఖలోని ప్రధాన పర్యాటక ప్రాంతాలపై VMRDA ఆంక్షలు విధించింది. కైలాసగిరి, సబ్‌మెరైన్, సీ-హారియర్ మ్యూజియంలు ఈ నెల 19వ తేదీ వరకు ఉదయం 7:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే 20వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 7 గంటల వరకు ఉండవన్నారు. అంతర్జాతీయ ప్రతినిధుల సందర్శనార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

News February 17, 2026

నటి ప్రత్యూష కేసు.. నిందితుడు లొంగిపోవాలని సుప్రీం ఆదేశం

image

నటి ప్రత్యూష మృతి <<19162866>>కేసులో<<>> సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది. 4 వారాల్లో పోలీసుల ఎదుట లొంగిపోవాలని నిందితుడు సిద్దార్థ రెడ్డిని ఆదేశించింది. హైకోర్టు విధించిన రెండేళ్ల శిక్షను సమర్థించింది. పోస్టుమార్టం అన్‌ప్రొఫెషనల్‌గా నిర్వహించారని ధర్మాసనం వ్యాఖ్యానించింది.