News April 8, 2025
పుష్కరాలకు త్వరితగతిన నిర్మాణ పనులను పూర్తి చేయాలి: కలెక్టర్

కాళేశ్వరం ఈఓ కార్యాలయంలో అధికారులతో కలెక్టర్ రాహుల్ శర్మ సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పుష్కరాలకు త్వరితగతిన నిర్మాణ పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా మరుగు దొడ్లు, మంచి నీరు, పుష్కర ఘాట్లలో స్నాన ఘట్టాలు, బట్టలు మార్చుకునే గదులు, చలువ పందిళ్ల ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.
Similar News
News September 19, 2025
58 ఉద్యోగాలకు నోటిఫికేషన్

బ్యాంక్ ఆఫ్ బరోడా(BOB)లో 58 ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడింది. మేనేజర్, చీఫ్ మేనేజర్, సీనియర్ మేనేజర్ తదితర పోస్టులున్నాయి. జాబ్స్‌ను బట్టి ఎకనామిక్స్/కామర్స్‌లో డిగ్రీ, MBA/PGDM పూర్తిచేసిన వారు అర్హులు. ఉద్యోగాన్ని బట్టి జీతం రూ.64,820 నుంచి రూ.1,20,940 వరకు ఉంటుంది. దరఖాస్తుకు చివరి తేదీ OCT 9.
వెబ్‌సైట్: <
#ShareIt
News September 19, 2025
సెట్టూరులో ప్రిన్సిపల్‌పై విద్యార్థి దాడి

అనంతపురం జిల్లా సెట్టూరులోని AP మోడల్ స్కూల్లో పదో తరగతి విద్యార్థి చరణ్ ప్రిన్సిపల్ శ్రీరాములుపై దాడి చేశాడు. ప్రిన్సిపల్ విద్యార్థిని మందలించడంతో కోపోద్రిక్తుడై చేయి చేసుకున్నాడు. ఉపాధ్యాయులు విద్యార్థిని పాఠశాల నుంచి బయటకు పంపించారు. ఘటనపై డిప్యూటీ DEO శ్రీనివాసులు పాఠశాలలో విచారణ చేపట్టారు.
News September 19, 2025
మహబూబాబాద్: ఐదుగురి కోసం 9 మంది..!

నెల్లికుదురు(M) రాజులకొత్తపల్లి జడ్పీ పాఠశాలలో ఐదుగురు విద్యార్థులకు 9 మంది ఉపాధ్యాయులు బోధన చేస్తుండటం విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతోంది. ఆరో తరగతిలో ఒకరు, ఏడో తరగతిలో ఇద్దరు, 8వ తరగతిలో ఇద్దరు విద్యార్థులు మాత్రమే ఉన్నారు. 9, 10వ తరగతుల్లో ఒక్క విద్యార్థి కూడా లేడు. పాఠశాల తెరిచి 3 నెలలు గడిచినా, విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి.