News November 1, 2025
పుష్కర కాలువలో దూకి యువకుడి ఆత్మహత్య

గోకవరం మండలం తంటికొండకు చెందిన కామిశెట్టి పుష్ప భగవాన్ (35) పుష్కర కాలువలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు గోకవరం ఎస్ఐ పవన్ కుమార్ శనివారం తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వివరించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News February 22, 2026
నల్లజర్ల: నడుచుకుంటూ వెళ్తూ వ్యక్తి మృతి

నల్లజర్ల మండలం ముసుళ్లకుంటలో ఆదివారం విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ గుర్తు తెలియని వ్యక్తి నడుచుకుంటూ వెళ్తుండగా అకస్మాత్తుగా కుప్పకూలి ప్రాణాలు విడిచాడని స్థానికులు తెలపారు. ఘటనా స్థలానికి చేరుకున్న నల్లజర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు అనే విషయాలపై ఆరా తీస్తున్నారు. మరణానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నారు.
News February 22, 2026
నిడదవోలులో ప్లాస్టిక్ గ్రహీత దిశగా అడుగు: మంత్రి దుర్గేష్

నిడదవోలు మండలం సమిశ్రగూడెం గ్రామంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద శనివారం సాయంత్రం మంత్రి దుర్గేష్ స్వచ్ఛ రథం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ఈ కార్యక్రమంతో గ్రామాల పరిస్థితి మెరుగుపడుతుందని, ప్లాస్టిక్ రహితంగా మారేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ప్లాస్టిక్ బాటిళ్లు, కవర్లు, తదితర వ్యర్థాలను స్వచ్చ రథాలకు ఇస్తే నిత్యవసర సరకులను ఉచితంగా ఇస్తారని అన్నారు.