News December 29, 2025

పుష్పగిరిలో ఒకే పలకపై త్రిమూర్తుల అరుదైన కుడ్య శిల్పం

image

వల్లూరు(M) పుష్పగిరి క్షేత్రం శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయ గోడపై ఒకే పలకపై త్రిమూర్తుల అరుదైన కుడ్య శిల్పం అద్భుతంగా ఉందని రచయిత చరిత్రకారుడు బొమ్మి శెట్టి రమేశ్ ఆదివారం తెలిపారు. బ్రహ్మ సృష్టికర్త, విష్ణువు సృష్టి పాలకుడు, పరమేశ్వరుడు సృష్టి లయ కారకుడన్నారు. త్రిమూర్తులు ఒకే పరబ్రహ్మం మూడు రూపాలు అని చెప్పారు.

Similar News

News January 1, 2026

ప్రొద్దుటూరు: వారం రోజుల్లో తగ్గిన బంగారం, పెరిగిన వెండి ధరలు

image

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర వారం రోజుల వ్యవధిలో రూ.5510 మేర తగ్గింది. ఇవాళ 10 గ్రాముల ధర ఇవాళ 1,37,300గా ఉంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర రూ.5,060 తగ్గి రూ.1,26,320 దగ్గర ఆగింది. అయితే వెండి మాత్రం కేజీ రూ.1,500 పెరిగింది. దీంతో ఇవాళ రూ.2,37,000కి చేరింది.

News January 1, 2026

ఏపీలో అతి పెద్ద జిల్లాగా కడప..!

image

జిల్లాల పునర్విభజన తర్వాత విస్తీర్ణంలో ఏపీలోనే కడప జిల్లా 12,507 చదరపు కిలో మీటర్లతో అతిపెద్ద జిల్లాగా మారింది. ఇక జనాభాలో రెండవ స్థానంలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం 8 నియోజకవర్గాలు, 5 రెవెన్యూ డివిజన్లు, 9 మున్సిపాలిటీలు, 40 మండలాలుగా అవతరించింది. జిల్లాలో 20,60,054 జనాభా ఉండగా.. రాజంపేట నియోజకవర్గంలోని 4 మండలాలు కలవడంతో ప్రస్తుతం 22,96,497కు చేరింది.