News December 29, 2025
పుష్పగిరిలో ఒకే పలకపై త్రిమూర్తుల అరుదైన కుడ్య శిల్పం

వల్లూరు(M) పుష్పగిరి క్షేత్రం శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయ గోడపై ఒకే పలకపై త్రిమూర్తుల అరుదైన కుడ్య శిల్పం అద్భుతంగా ఉందని రచయిత చరిత్రకారుడు బొమ్మి శెట్టి రమేశ్ ఆదివారం తెలిపారు. బ్రహ్మ సృష్టికర్త, విష్ణువు సృష్టి పాలకుడు, పరమేశ్వరుడు సృష్టి లయ కారకుడన్నారు. త్రిమూర్తులు ఒకే పరబ్రహ్మం మూడు రూపాలు అని చెప్పారు.
Similar News
News December 31, 2025
భవిష్యత్‌లో మా టార్గెట్లు ఇవే: కడప ఎస్పీ

రాబోయే రోజుల్లో కడప జిల్లాను సాంకేతిక మరింత మెరుగుపరిచేలా చేస్తామని SP నచికేత్ తెలిపారు. AIను ఉపయోగించుకొని కార్యాలయ పనులు, రహదారి భద్రత పెంచుతామన్నారు. దర్యాప్తులను సమయానికి పూర్తి చేస్తామని తెలిపారు. PGRSలో వచ్చిన ఫిర్యాదులను నాణ్యతతో, నిర్ణీత సమయంలో పూర్తి చేస్తామన్నారు. జిల్లాలో రౌడీయిజం లేకుండా చేస్తామన్నారు. రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన పెంచి రోడ్డు ప్రమాదాలను తగ్గేలా చూస్తామన్నారు.
News December 31, 2025
2025: 657 మంది మిస్సింగ్.. 593 మంది ఆచూకీ లభ్యం: ఎస్పీ

2024 ఏడాదిలో 571 మిస్సింగ్ కేసులు నమోదు కాగా.. వారిలో 540 మంది ఆచూకి కనుగొని, కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఎస్పీ నచికేత్ తెలిపారు. 2025 ఏడాదిలో 657 మిస్సింగ్ కేసులు నమోదు కాగా.. వారిలో 593 మంది ఆచూకి గుర్తించి, కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు తెలిపారు. గత ఏడాది 222 చీటింగ్ కేసులు నమోదు కాగా.. ఈ ఏడాదిలో 221 కేసులు నమోదయ్యాయని వివరించారు.
News December 31, 2025
కొత్తగా కడప జిల్లా..!

రాజంపేట నియోజకవర్గాన్ని కడప జిల్లాలో కలుపుతూ ప్రభుత్వం తుది నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఇప్పుడు కడప జిల్లా 40 మండలాలు, 5 రెవెన్యూ డివిజన్లుగా (బద్వేల్, కడప, జమ్మలమడుగు, పులివెందుల, రాజంపేట) ఏర్పాటైంది. బద్వేల్ రెవెన్యూ డివిజన్లో 9 మండలాలు, కడపలో 9, జమ్మలమడుగులో 10, పులివెందులలో 8, రాజంపేటలో 4 మండలాలు ఉంటాయి. అన్నమయ్య, నెల్లూరు, తిరుపతి, మార్కాపురం, అనంతపురం, సత్యసాయి కడప జిల్లా బౌండరీలు.


