News December 4, 2024

‘పుష్ప-2’ విడుదల.. శిల్పా రవి ఆసక్తికర ట్వీట్ 

image

తన స్నేహితుడు అల్లు అర్జున్ ‘పుష్ప-2’ విడుదల సందర్భంగా నంద్యాల YCP మాజీ MLA శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైర్ కదా?.. వైల్డ్ ఫైర్’ అని అర్థం వచ్చేలా ఎమోజీలతో ట్వీట్ చేశారు. శిల్పా రవి ఈ రాత్రికే ఈ మూవీని వీక్షించనున్నట్లు సమాచారం. మరోవైపు జిల్లాలోని థియేటర్ల వద్ద ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ సందడి నెలకొంది. 

Similar News

News March 6, 2026

అక్రమ మైనింగ్‌ను కట్టడి చేయాలి: కలెక్టర్

image

జిల్లాలో అక్రమ మైనింగ్ కార్యకలాపాలను పూర్తిగా అరికట్టడంతో పాటు మైనింగ్‌కు సంబంధించిన అనుమతులను నిబంధనల ప్రకారం మంజూరు చేయాలని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అధికారులకు ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో మైన్స్ అండ్ జియాలజీ శాఖకు సంబంధించిన అంశాలపై జిల్లాస్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. సహజ వనరులను సంరక్షించడం ప్రభుత్వ ప్రధాన బాధ్యత అన్నారు.

News March 6, 2026

ఓపెన్ హౌస్‌లో పోలీసు ఆయుధాల ప్రదర్శన

image

కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల సందర్భంగా విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. పోలీసు ఆయుధాల ప్రదర్శన ఏర్పాటు చేసి వాటి వినియోగం గురించి వివరించారు. మహిళల భద్రత కోసం అమలు చేస్తున్న శక్తి యాప్, హెల్ప్‌లైన్ నంబర్లపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సీఐ విజయలక్ష్మి, ఆర్‌ఐ జావేద్, ఎస్సైలు, ఎన్‌సీసీ విద్యార్థులు పాల్గొన్నారు.

News March 6, 2026

సీజనల్ వ్యాధులపై కలెక్టర్ సమీక్ష

image

కర్నూలు కలెక్టరేట్‌లో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి జాయింట్ ఇన్స్పెక్షన్ కమిటీ సమావేశాన్ని కలెక్టర్ డా.ఏ.సిరి నిర్వహించారు. విద్యార్థులు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ప్రభుత్వ వసతి గృహాలు, పాఠశాలల్లో నీటి నమూనాలను 15 రోజులకు ఒకసారి సేకరించి పరీక్షించాలని ఆమె ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈని ఆదేశించారు. పరిశుభ్రమైన తాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.