News January 22, 2026

పుష్ప-3లో సల్మాన్ ఖాన్? సక్సెస్ అయితే..

image

పుష్ప-3 స్క్రిప్ట్ పనులు కొనసాగుతున్నట్లు యూనిట్ వర్గాలు హింట్ ఇచ్చాయి. ఈ మూవీ 2 పార్ట్‌లు సాధించిన సక్సెస్‌ను దృష్టిలో ఉంచుకొని ‘పుష్ప’ను ఓ యూనివర్స్‌లా మార్చే ప్లాన్‌లో ఉన్నారని తెలుస్తోంది. ఈ మేరకు HYDలో ఆఫీస్ ఓపెన్ చేశారట. అందులో భాగంగా పుష్ప-3లో సల్మాన్ ఖాన్‌ను పవర్‌ఫుల్ రో‌ల్‌లో ఇంట్రడ్యూస్ చేయనున్నట్లు సమాచారం. సక్సెస్‌ను బట్టి ఆయనతో పుష్ప సిరీస్‌లో ప్రత్యేక సినిమా ఉండొచ్చని టాక్.

Similar News

News February 7, 2026

సాగు భూములకే రైతు భరోసా!

image

TG: రైతు భరోసా(₹6,000) కేవలం సాగులో ఉన్న భూములకే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వానాకాలం సీజన్‌లో సాగు వివరాల ఆధారంగా అర్హులైన రైతులకే నగదు జమ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే అగ్రికల్చర్ వర్సిటీ శాటిలైట్ మ్యాపింగ్ సర్వే పూర్తి చేయగా 1.53 కోట్ల ఎకరాల సాగుభూమిలో 20 లక్షల ఎకరాలు పంట వేయకుండా ఉన్నట్లు తేలింది. కాగా మున్సిపోల్ తర్వాత రైతు భరోసా ఇస్తామని CM ప్రకటించారు.

News February 7, 2026

రేపు సూర్యుడిని ఎందుకు పూజించాలి?

image

రేపు భాను సప్తమి. దీన్నే ‘ఆరోగ్య సప్తమి’ అని కూడా అంటారు. ఈ రోజున సూర్యోదయానికి ముందే పవిత్ర నదులలో స్నానం చేస్తే చర్మ వ్యాధులు తొలగిపోయి, శరీరం శుద్ధి అవుతుందని నమ్ముతారు. సూర్యరశ్మిలోని శక్తి మన శారీరక, మానసిక అనారోగ్యాలను నయం చేస్తుంది. నిష్ఠతో ఉపవాసం ఉండి సూర్యుడిని పూజించే వారికి గత జన్మల పాపాల నుంచి విముక్తి లభించడమే కాకుండా, ఏడాది పొడవునా సంపూర్ణ ఆరోగ్యంతో ఉండేలా దైవిక రక్షణ లభిస్తుంది.

News February 7, 2026

వాకింగ్‌కి టైమ్ లేదా? ఈ చిన్న పనులతో గుండె ఆరోగ్యం

image

✦ జిమ్/లాంగ్ వాక్‌కు టైమ్ లేకపోయినా VILPA (విగరస్ ఇంటర్మిటెంట్ లైఫ్‌స్టైల్ ఫిజికల్ యాక్టివిటీ) గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
✦ లిఫ్ట్/ఎస్కలేటర్‌కు బదులు మెట్లు ఎక్కడం, వేగంగా నడవడం మంచిది.
✦ ఇంటి పనులు చేయడం, గ్రాసరీస్ మోయడం, పిల్లలతో ఆడుకోవడమూ యాక్టివిటీనే.
✦ ఎక్కువసేపు కూర్చోకుండా 30నిమిషాలకు ఒకసారి అటు ఇటు తిరగాలి.
✦ డాన్స్, వంట చేస్తూ ఫుట్ ట్యాప్ చేయడం కూడా ఎక్సర్‌సైజ్ చేసినట్టే.