News December 17, 2025

పూజలతో బ్రహ్మ రాసిన రాతను మార్చొచ్చా?

image

‘అంతా తలరాత ప్రకారమే జరుగుతుంది అన్నప్పుడు పూజలు ఎందుకు చేయాలి?’ అనే సందేహం కొందరిలో ఉంటుంది. అయితే బ్రహ్మదేవుడు నుదుటిపై రాత రాసేటప్పుడు ‘నేను రాసిన రాతను నేను కూడా తప్పించలేను. కానీ ఉపాసన, ఆరాధన, అర్చనల ద్వారా ఆ విధిని మార్చుకునే శక్తి మీ చేతుల్లోనే పెడుతున్నాను’ అని కూడా రాశాడట. కాబట్టి, మన అర్చనలు, ఉపాసనలు, కర్మల ద్వారా మన విధిని మనం సవరించుకునే అవకాశం ఉంటుంది.

Similar News

News March 6, 2026

అమెరికా చేతిలో గల్ఫ్ దేశాలు బలి!

image

మిడిల్ ఈస్ట్‌లోని చాలా దేశాల్లో అమెరికాకు మిలిటరీ స్థావరాలు ఉన్నాయి. ఆయా దేశాలతో కుదుర్చుకున్న రక్షణ ఒప్పందాలు, ఆటంకాలు లేని చమురు సరఫరా కోసం అమెరికా ఈ స్థావరాలను నిర్మించింది. అయితే అవే ఇప్పుడు గల్ఫ్ దేశాలకు ముప్పుగా మారాయి. వాటిని లక్ష్యంగా చేసుకొని ఇరాన్ దాడులకు తెగబడుతోంది. దీంతో అసలు యుద్ధంతో సంబంధం లేని సౌదీ, యూఏఈ, ఖతర్, బహ్రెయిన్, కువైట్‌లకు నష్టం వాటిల్లుతోంది.

News March 6, 2026

ఏసీలు కొనేవారికి షాక్

image

వేసవి ప్రారంభంలోనే ఏసీ ధరలు చెమటలు పట్టిస్తున్నాయి. ఇప్పటికే LG, హిటాచీ దాదాపు 5-7 శాతం రేట్లను పెంచాయి. రానున్న 3-10 రోజుల్లో బ్లూ స్టార్, వోల్టాస్, ఇతర బ్రాండ్లు 10-15 శాతం మేర ధరలను పెంచే అవకాశం కనిపిస్తోంది. పెరిగిన ముడి సరకు ధరలను భర్తీ చేసుకోవడానికి కంపెనీలు వేసవి డిమాండ్‌ను ఉపయోగించుకుంటున్నాయి. ముఖ్యంగా AC కంప్రెసర్లు, కాయిల్స్‌లో వాడే <<19232225>>రాగి రేటు<<>> భారీగా పెరిగిన విషయం తెలిసిందే.

News March 6, 2026

ఎల్లుండి ఫైనల్.. అభిషేక్ శర్మ వైపే మొగ్గు!

image

T20WCలో వరుసగా విఫలం అవుతున్న అభిషేక్ శర్మను పక్కన పెట్టాలనే డిమాండ్స్ వస్తున్నాయి. అయితే అతడికి ఫైనల్లోనూ ఛాన్స్ ఇవ్వాలని టీమ్ యాజమాన్యం యోచిస్తున్నట్లు PTI తెలిపింది. అభిషేక్ దూకుడును సపోర్ట్ చేయాలని మేనేజ్‌మెంట్ భావిస్తోందని పేర్కొంది. టీమ్‌లో మార్పులు చేస్తే కాంబినేషన్ డిస్టర్బ్ అవుతుందని, అందుకే ఫైనల్లో మార్పులు ఉండకపోవచ్చని పేర్కొంది.