News January 23, 2026
పూజ చేయడం వెనుక సైంటిఫిక్ రీజన్

పూజ భక్తి మాత్రమే కాదు. గొప్ప మానసిక ప్రక్రియ కూడా. పూజలో వాడే గంటల శబ్దం మెదడులోని రెండు భాగాలను ఏకం చేసి ఏకాగ్రతను పెంచుతుంది. దీపపు కాంతి కంటి చూపును మెరుగుపరుస్తుంది. కర్పూరం, ధూపం గాలిలోని సూక్ష్మక్రిములను సంహరించి స్వచ్ఛమైన ఆక్సిజన్‌ను అందిస్తాయి. మంత్రోచ్ఛారణ తరంగాలు రక్తపోటును తగ్గిస్తాయి. మనసుకు ప్రశాంతతను ఇస్తాయి. పంచేంద్రియాలను ఉత్తేజపరిచి, శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి.
Similar News
News February 26, 2026
NIT వరంగల్‌లో 39 పోస్టులు.. దరఖాస్తుకు ఎల్లుండే లాస్ట్ డేట్

NIT వరంగల్‌లో 39 పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. పోస్టును బట్టి డిగ్రీ, పీజీ, బీఈ/బీటెక్, డిప్లొమా, ఎంసీఏ, ఎంఎస్సీ ఫిజిక్స్, ఇంటర్, టెన్త్, ఐటీఐ అర్హతగల వారు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.1500, SC, ST, PwBDలకు రూ.1000. స్క్రీనింగ్/స్కిల్/ రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://nitw.ac.in/
News February 26, 2026
గొర్రెల పెంపకం – సాంద్ర పద్ధతి అంటే ఏంటి?

సాంద్ర పద్ధతిలో గొర్రెలు ఎప్పుడూ పాకల్లోనే ఉంటాయి. వీటికి నిర్ణీత మోతాదులో పచ్చిగడ్డి, దాణాను ఏర్పాటు చేయాలి. పరిశుభ్రమైన నీటిని అందుబాటులో ఉంచాలి. జీవాల లెక్కింపు, మందులు, టీకాలు వేయడం ఈ విధానంలో సులభంగా ఉంటుంది. పశుగ్రాసం వృథాకాదు. అయితే పాకలను పరిశుభ్రంగా ఉంచాలి. షెడ్లలోనికి గాలి వెలుతురు సరిగా ప్రసరించేలా చూడాలి. పచ్చి పశుగ్రాసాలను చాఫ్ కట్టర్‌తో చిన్న ముక్కలుగా చేసి దాణా తొట్లలో అందించాలి.
News February 26, 2026
అదృష్టం కోసం చేసే ‘గురువార వ్రతం’

గురువారం బృహస్పతికి అంకితం. ఆయన జ్ఞానం, ఐశ్వర్యం, సంతానం, అదృష్టాలను ప్రసాదిస్తారు. జాతకంలో గురు దోషం, ఆర్థిక ఇబ్బందులున్నవారు గురువారం రోజున గురువార వ్రతాన్ని ఆచరిస్తారు. బృహస్పతిని విష్ణువు స్వరూపంగా భావిస్తారు కాబట్టి వ్రతంలో బాగంగా ఆయనను కూడా పూజించవచ్చు. తద్వారా మనసులో కోరికలు నెరవేరి, కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయని నమ్మకం. కెరీర్ సమస్యలు పోయి, అవివాహితులకు త్వరగా వివాహం జరుగుతుందట.


