News March 22, 2025
పూడిచెర్లలో ఫారంపాండ్ నిర్మాణానికి పవన్ కళ్యాణ్ భూమి పూజ

పాణ్యం నియోజకవర్గం ఓర్వకల్లు మండలం పూడిచెర్ల గ్రామ పరిధిలో ఉన్న రైతు సూరా రాజన్న పొలంలో ఫారం పాండ్ నిర్మాణ పనులకు శనివారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భూమి పూజ చేసి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఓర్వకల్లు నుంచే 1.55 లక్షల ఫారంపాండ్ల నిర్మాణాలకు శ్రీకారం చుడుతున్నట్లు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కాగా, వేదికపైకి చేరుకున్న డిప్యూటీ సీఎం పవన్ బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు.
Similar News
News March 23, 2025
డిచ్‌పల్లి: ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

డిచ్‌పల్లి SBI గ్రామీణ స్వయం ఉపాధి సంస్థ ఆధ్వర్యంలో బ్యూటీ పార్లర్, టైలరింగ్ కోర్సుల్లో ఉచిత శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు గ్రామీణ స్వయం ఉపాధి సంస్థ డైరెక్టర్ సుంకేం శ్రీనివాస్ తెలిపారు. శిక్షణకు 19 నుంచి 45 సంవత్సరాలు లోపు NZB, కామారెడ్డికి జిల్లాలకు చెందిన మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News March 23, 2025
NZB: చెరువులో పడి ఒకరు మృతి

న్యాల్కల్ చెరువులో ప్రమాదవశత్తు పడి ఓ వ్యక్తి మృతి చెందినట్లు మోపాల్ SI యాదగిరి గౌడ్ తెలిపారు. మంచిప్ప గ్రామానికి చెందిన గుండం సాయిలు(55) శుక్రవారం రాత్రి తన మిత్రుడితో కలిసి న్యాల్కల్ చెరువులో చేపల పట్టేందుకు వెళ్ళాడు. ప్రమాదశాత్తు చెరువులో పడి మృతి చెందాడు. శనివారం ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పంచనామా నిమిత్తం మార్చురీకి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News March 23, 2025
మార్చి 23: చరిత్రలో ఈరోజు

1893: భారతదేశ ఆవిష్కర్త, ఇంజనీర్ జి.డి.నాయుడు జననం
1934: సినీ గాయకుడు కె.బి.కె.మోహన్ రాజు జననం
1968: సినీ నటుడు శ్రీకాంత్ జననం
1979: సినీ గాయకుడు విజయ్ ఏసుదాస్ జననం
1987: నటి, పొలిటీషియన్ కంగనా రనౌత్ జననం
1931: జాతీయోద్యమ నాయకులు భగత్ సింగ్, సుఖ్ దేవ్ మరణం (ఫొటోలో)
* ప్రపంచ వాతావరణ శాస్త్ర దినోత్సవం