News August 23, 2025
పూతలపట్టులో గుర్తుతెలియని మృతదేహం లభ్యం

పూతలపట్టు మండలం బందర్లపల్లి సమీపంలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం అయింది. ట్రైన్ నుంచి అదుపుతప్పి వ్యక్తి కింద పడి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. పూతలపట్టు సీఐ కృష్ణమోహన్, రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే విచారిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News August 23, 2025
29న సీఎం చంద్రబాబు కుప్పం పర్యటన

సీఎం చంద్రబాబు కుప్పం పర్యటన ఖరారైంది. ఈనెల 29, 30 తేదీల్లో సీఎం కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. 29న ఆయన కుప్పం చేరుకుని సొంతింట్లో బసచేస్తారు. 30వ తేదీ సతీ సమేతంగా పరమసముద్రం వద్ద హంద్రీనీవా జలాలను విడుదల చేసి జల హారతి ఇస్తారు. అక్కడే జరిగే బహిరంగ సభలో సీఎం పాల్గొననున్నారు. దీనికి సంబంధించి పూర్తి షెడ్యూల్ తెలియాల్సి ఉంది.
News August 23, 2025
DSC ఫలితాల్లో తిరుపతి జిల్లా వాసి సత్తా.!

శుక్రవారం విడుదలైన మెగా DSC ఫలితాల్లో తిరుపతి జిల్లా యువకుడు సత్తా చాటాడు. ఎర్రవారిపాలెం మండలం ఓఎస్ గొల్లపల్లికి చెందిన ముండ్రే శేషాద్రి ఏకంగా ఐదు ఉద్యోగాలకు అర్హత సాధించాడు. ☞ S.A SOCIAL-80.63(9ర్యాంక్) ☞ SGT-86.33( 53ర్యాంక్) ☞ S.A తెలుగు -73.05(42ర్యాంక్) ☞ T.G.T తెలుగు -71.00(127ర్యాంక్) ☞ T.G.T SOCIAL-70.93(82ర్యాంక్) సాధించాడు. ఈ మేరకు ఆయన్ను పలువురు అభినందించారు.
News August 23, 2025
చిత్తూరు కలెక్టర్ పేరుతో ఫేక్ అకౌంట్.. కేసు నమోదు

జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేరిట నకిలీ ఫేస్ బుక్ అకౌంట్ క్రియేట్ చేసి, డబ్బులు డిమాండ్ చేయడంపై శుక్రవారం టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐ రమేశ్ బాబు కథనం మేరకు.. కలెక్టర్ పేరుపై గుర్తు తెలియని వ్యక్తి ఫేక్ ఐడీని క్రియేట్ చేశాడు. జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులను పరిచయం చేసుకొని డబ్బు అడగడం మొదలుపెట్టాడు. కలెక్టరేట్ ఏవో వాసుదేవన్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.