News March 5, 2025
పూతలపట్టులో రిపోర్టర్లు కావలెను.!

పూతలపట్టు నియోజకవర్గంలో పనిచేయడానికి రిపోర్టర్ల నుంచి Way2News దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఐరాల, తవణంపల్లె, పూతలపట్టు,బంగారుపాలెం,యాదమర్రి మండలానికి చెంది, అనుభవం ఉన్నవాళ్లే అర్హులు. ప్రస్తుతం ఏదైనా మీడియాలో పనిచేస్తున్న వాళ్లు సైతం అర్హులుగా పరిగణిస్తాం. <
Similar News
News March 6, 2025
నిధులకు కొరత లేదు: చిత్తూరు కలెక్టర్

వేసవిలో తాగునీటి సమస్యపై అలసత్వం వద్దని అధికారులకు చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. జిల్లా సచివాలయం నుంచి RWS అధికారులు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తాగునీటి సమస్య నివారణకు నిధుల కొరత లేదని స్పష్టం చేశారు. పంచాయతీల వారీగా తాగునీటి సరఫరాపై అవగాహన కలిగి ఉండాలన్నారు. నీరు కలుషితం కాకుండా చూసుకోవాలని సూచించారు.
News March 5, 2025
చిత్తూరు: లింగ సమానత్వంపై పెయింటింగ్ పోటీలు

మహిళా సాధికారత వారోత్సవాల్లో భాగంగా చిత్తూరు జిల్లాలోని పలు పాఠశాలల్లో లింగ సమానత్వంపై పెయింటింగ్ పోటీలు బుధవారం నిర్వహించినట్టు ఎస్పీ మణికంఠ తెలిపారు. మహిళా, పురుష సమానత్వంపై అవగాహన పెంచేలా పోటీలు ఉపయోగపడతాయన్నారు. మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తున్న విషయాన్ని అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. ఈనెల 8 వరకు వివిధ కార్యక్రమాలు చేపడతామన్నారు.
News March 5, 2025
చిత్తూరు యువతకు గమనిక

యూత్ పార్లమెంట్ పోటీలకు ఈనెల 9వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని NYK కోఆర్డినేటర్ ప్రదీప్ కోరారు. 18 నుంచి 25 ఏళ్ల లోపు యువత మై భారత్ పోర్టల్‌లో నిమిషం నిడివి గల వికసిత్ భారత్ అంటే ఏమిటి అనే వీడియోను అప్లోడ్ చేసి రిజిస్టర్ కావాలని సూచించారు. 15న చిత్తూరు పీవీకేఎన్ డిగ్రీ కళాశాలలో స్క్రీనింగ్ నిర్వహించి అర్హులను ఎంపిక చేస్తామన్నారు. ప్రిన్సిపల్ జీవనజ్యోతి గోడపత్రిక ఆవిష్కరించారు.