News April 12, 2025
పూతలపట్టు ఎమ్మెల్యేకు తానా ఆహ్వానం

పూతలపట్టు MLA మురళీ మోహన్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఉత్తర అమెరికాలోని అతి పెద్ద భారతీయ అమెరికన్ సంస్థగా గుర్తింపు పొందిన తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) ప్రతినిధులు ఆయన్ను శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. జూలై 3 నుంచి 5వ తేదీ వరకు అమెరికాలోని నోవో మిచిగన్‌లో జరిగే సదస్సుకు హాజరు కావాలని కోరారు.
Similar News
News April 18, 2025
చిత్తూరులో రేపు మెగా జాబ్ మేళా

చిత్తూరు గ్రీన్ పేటలోని డిగ్రీ కళాశాలలో 19న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు DSDO గుణశేఖర్ రెడ్డి శుక్రవారం తెలిపారు. 20 ప్రముఖ కంపెనీలలో ఖాళీగా ఉన్న 1,000 పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తామన్నారు. టెన్త్ నుంచి ఎంబీఏ వరకు అర్హత కలిగిన అభ్యర్థులు https://naipunyam.ap.gov.in/user-registration వెబ్‌సైట్ ద్వారా రిజిస్టర్ అవ్వాలన్నారు.
News April 18, 2025
చిత్తూరు: పద్మ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం

గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం అందించే పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీలకు అంతర్జాతీయస్థాయిలో అత్యుత్తమ ప్రతిభ చూపిన క్రీడాకారుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఎస్డీవో బాలాజీ తెలిపారు. అర్హులైనవారు ఈనెల 26వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాలకు డీఎస్ఏ కార్యాలయాన్ని సంప్రదించాలని ఓ ప్రకటనలో కోరారు.
News April 18, 2025
చిత్తూరు: ఒకటవ తరగతికి ఆన్‌లైన్ అడ్మిషన్లు

ఉచిత నిర్భంద విద్యా హక్కు చట్టం ప్రకారం ఒకటో తరగతిలో అడ్మిషన్లకు ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవాలని చిత్తూరు డీఈవో వరలక్ష్మి సూచించారు. 2025-26 విద్యాసంవత్సరంలో ఒకటో తరగతి అడ్మిషన్లకు ప్రైవేట్, అన్ఎయిడెడ్ పాఠశాలల్లో ఐబీ, ఐసీఎస్ఈ, సీబీఎస్ఈ, స్టేట్ సిలబస్ అమలు చేయాలన్నారు. ఈనెల 28వ తేదీ నుంచి మే 15వ తేదీలోపు www.cre.ap.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాలన్నారు.