News January 16, 2026

పూరీ-సేతుపతి ‘స్లమ్ డాగ్’.. ఫస్ట్ లుక్ విడుదల

image

పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్న సినిమాకు ‘స్లమ్ డాగ్’ అనే టైటిల్ ఖరారైంది. హీరో బర్త్‌డే సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మూవీ టీమ్ రిలీజ్ చేసింది. ఇందులో విజయ్ నోట్ల కట్టల మధ్య కత్తి పట్టుకొని కనిపిస్తున్నారు. సంయుక్తా మేనన్, టబు, దునియా విజయ్ నటిస్తున్న ఈ మూవీ తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్ అందిస్తున్నారు.

Similar News

News February 15, 2026

చెరకు పంట నరికేటప్పుడు ఇలా చేస్తే మేలు

image

చెరకు పంటను నరికేటప్పుడు గడలను భూమట్టానికే నరకాలి. కొన్ని ప్రాంతాల్లో భూమి పైన రెండు, మూడు అంగుళాలు వదిలేసి నరుకుతుంటారు. ఇలా చేయడం వల్ల రైతుకు నష్టం. మొదలు కణుపులలో పంచదార పాలు ఎక్కువగా ఉండడం వల్ల ఇటు పంచదార అటు బెల్లం దిగుబడులు కూడా తగ్గుతాయి. చెరకును భూమట్టానికి నరికి ఖాళీ చేసిన తోటల్లో వేళ్లు లోతుగా చొచ్చుకెళ్లి తోట బలంగా పెరిగి వర్షాకాలంలో వచ్చే ఈదురు గాలులు, వర్షాలను కూడా తట్టుకుంటుంది.

News February 15, 2026

పరమ భక్తుడు ‘సిరియాళుడు’

image

సిరియాళుడు ప్రతిరోజు ఓ శివ భక్తుడికి భోజనం పెట్టిన తర్వాతే తను తినేవాడు. ఆయన భక్తిని పరీక్షించడానికి శివుడు ఓ వృద్ధుడి రూపంలో వచ్చి సిరియాళుడి ఏకైక కుమారుడిని వండి వడ్డించమని అడుగుతాడు. భక్తి కోసం సిరియాళుడు ఆ కఠినమైన పనికి అంగీకరిస్తాడు. ఆ దంపతుల నిశ్చల భక్తికి మెచ్చిన పరమశివుడు, వారి కుమారుడిని తిరిగి బ్రతికించి, ఆ కుటుంబం మొత్తానికి మోక్షాన్ని ప్రసాదించాడు. నిస్వార్థ భక్తికి ఆయన నిదర్శనం.

News February 15, 2026

నేషనల్ ఆయుష్ మిషన్‌లో ఉద్యోగాలు

image

నేషనల్ ఆయుష్ మిషన్(<>NAM)<<>> 20 కాంట్రాక్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత గలవారు ఫిబ్రవరి 28 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి పీజీ డిప్లొమా పబ్లిక్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్/మేనేజ్‌మెంట్/MBA, BAMS/BUMS/BHMS/BSMS/BYNS, MCom, ICWA, CA, MCA, BCA అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల వయసు 21 నుంచి 60ఏళ్ల మధ్య ఉండాలి. వెబ్‌సైట్: https://ayush.gov.in