News March 6, 2026

పూర్తిస్థాయిలో నివేదిక ఇవ్వాలి: కలెక్టర్

image

స్వర్ణాంధ్ర సుస్థిర అభివృద్ధికి నిర్దేశించిన కీ పెర్ఫార్మెన్స్ ఇండికేషన్ లక్ష్యాలు 100% అధిగమించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ వీసీ హాలులో శుక్రవారం జరిగిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడారు. 100% పెర్ఫార్మెన్స్ సాధించడానికి గల కారణాలు, తక్కువ పెర్ఫార్మెన్స్ రావటానికి గల కారణాలను అన్ని శాఖలు పూర్తిస్థాయిలో నివేదిక ఇవ్వాలన్నారు.

Similar News

News April 14, 2026

అమరావతిలో అమృత వర్సిటీ క్యాంపస్

image

రాజధాని అమరావతిలో అమృత విశ్వవిద్యాపీఠం ఏర్పాటు కానుంది. దీనికి సంబంధించిన నూతన క్యాంపస్ మాస్టర్ ప్లాన్‌ సిద్ధమైంది. అమరావతిలో సుమారు 150 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఈ అత్యాధునిక క్యాంపస్‌ను నిర్మించనున్నారు. రాజధానిలోకి ప్రఖ్యాతి గాంచిన విద్యా సంస్థల రాకతో ఇక్కడి విద్యార్థులకు మరింత మెరుగైన ఉన్నత విద్యావకాశాలు అందుబాటులోకి రానున్నాయి.

News April 14, 2026

అన్ని వర్గాల హక్కుల ప్రదాత రాజ్యాంగ నిర్మాత: లోకేశ్

image

అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకొని మంత్రి లోకేశ్ తన ఉండవల్లి నివాసంలో నివాళులర్పించారు. అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి, ఆయన సేవలను స్మరించుకున్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల శ్రేయస్సు కోసం, దేశాభివృద్ధి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహోన్నత వ్యక్తి అంబేడ్కర్ అని లోకేశ్ కొనియాడారు. రాజ్యాంగం ద్వారా అన్ని వర్గాల ప్రజలకు సమాన హక్కులు కల్పించిన ఘనత ఆయనకే దక్కుతుందని ప్రశంసించారు.

News April 14, 2026

GNT: జపాన్ రాయబారితో నారా లోకేశ్ భేటీ

image

​ఢిల్లీ పర్యటనలో జపాన్ రాయబారి ఒనో కెయిచితో మంత్రి నారా లోకేశ్ సమావేశమయ్యారు. ఏపీ, జపాన్ మధ్య ఉన్న అనుబంధంపై వీరు చర్చించారు. శ్రీసిటీలో ఇప్పటికే పలు జపాన్ కంపెనీలు ఉన్నాయని లోకేశ్ గుర్తుచేశారు. రాష్ట్రానికి మరిన్ని జపాన్ పెట్టుబడులను ఆకర్షించే మార్గాలపై ప్రధానంగా చర్చలు జరిపినట్లు ఆయన ‘X’ వేదికగా వెల్లడించారు.