News December 12, 2025
పూర్వ విద్యార్థుల సమావేశానికి సిద్ధమవుతున్న AU

ఆంధ్ర విశ్వవిద్యాలయం వార్షిక పూర్వ విద్యార్థుల సమావేశం 2025కు సిద్ధమైంది. శనివారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి బీచ్ రోడ్‌లోని ఏయు కన్వెన్షన్ సెంటర్ వేదికగా కార్యక్రమం జరగనుంది. శతాబ్ది సంవత్సరంలో జరుగుతున్న ఈ సమావేశానికి రాజ్యసభ సభ్యురాలు సుధామూర్తి ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారు. సంఘం వ్యవస్థాపక చైర్మన్ జి.ఎం రావు తదితరులు పాల్గొంటారు. వర్సిటీ భవనాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు.
Similar News
News December 12, 2025
విశాఖలో మంత్రి నారా లోకేష్ ప్రజాదర్బార్

విశాఖలో మంత్రి నారా లోకేష్ శుక్రవారం విశాఖ పార్టీ కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. స్టీల్ ప్లాంట్ టౌన్ షిప్‌లో గత 40 ఏళ్లుగా నిర్వహిస్తున్న విశాఖ విమల విద్యాలయాన్ని ఏకపక్షంగా మూసివేయడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పలువురు ఆవేదన చెందారు. రెగ్యులర్ స్టాఫ్‌కు స్టీల్ ప్లాంట్లో ఉద్యోగ అవకాశం ఇవ్వాలని కొందరు విజ్ఞప్తి చేశారు. తన తండ్రి ఇంటిని ఆక్రమించారని, న్యాయం చేయాలని ఒకరు కోరారు.
News December 12, 2025
విశాఖ: SI ట్రైనింగ్ పూర్తయ్యినా పోస్టింగులు లేవు

ట్రైనింగ్ పూర్తిచేసుకున్న SIలకు పోస్టింగులు ఇవ్వకపోవడంపై విశాఖ రేంజ్‌లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలోని 4 రేంజ్‌లలో ఇప్పటికే పోస్టింగులు ఇచ్చినా.. విశాఖ రేంజ్‌కే జాప్యం కొనసాగుతోంది. డిసెంబర్ 5తో ట్రైనింగ్ పిరియడ్ పూర్తయింది. విశాఖ రేంజ్‌లో మొత్తం 49 మంది SIలకు ట్రైనింగ్ పూర్తైనా ఇప్పటి వరకు పోస్టింగ్ ఇవ్వలేదు. మరోపక్క నగరంలో పోలీసు సిబ్బంది కొరత ఉండటంతో లా అండ్ ఆర్డర్‌కు కష్టమౌతోంది.
News December 12, 2025
విశాఖకు 100 ఎలక్ట్రానిక్ బస్సులు వస్తున్నాయ్..!

త్వరలోనే 100 ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సులు విశాఖలో రొడ్డెక్కనున్నాయి. ఈ ఎలక్ట్రికల్ బస్సుల ఛార్జింగ్ స్టేషనులకు భారీగా ఖర్చు అవుతుందని ఆర్టీసీ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. హై స్పీడ్‌తో కూడిన ఛార్జింగ్ కేంద్రాలు 20 వరకు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తొంది. విశాఖలో ప్రస్తుతం 175 బస్సులు అవసరం ఉండగా.. ఈ బస్సులు అందుబాటులోకి వస్తే ప్రయాణికులకు ఇబ్బందులు ఉండవని భవిస్తున్నారు.


