News March 23, 2025

పెంచికల్పేట్: గ్రామాల అభివృద్ధే కాంగ్రెస్ లక్ష్యం: MLC

image

మారుమూల గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ లక్ష్యమని MLC దండే విఠల్ పేర్కొన్నారు. పెంచికల్పేట్ మండల కేంద్రంలో నూతన సీసీ రోడ్లకు ఆదివారం ఎమ్మెల్సీ దండే విఠల్ భూమిపూజ చేశారు. ఆయన మాట్లాడుతూ.. మండల కేంద్రంలో రూ.45 లక్షలతో సీసీ రోడ్లు, ఎస్సీ కమ్యూనిటీ హాల్, దారుగపల్లి, చేడువాయి గ్రామాలకు రూ.10 లక్షల చొప్పున మంజూరయ్యాయని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Similar News

News March 25, 2025

BREAKING: దండెంపల్లి SLBC కాలువలో ఇద్దరు గల్లంతు

image

నల్గొండ జిల్లా దండెంపల్లి SLBC కాలువలో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. నేటి ఉదయం ఆరుగురు యువకులు దండెంపల్లి SLBC కాలువలో ఈతకు వెళ్లగా ప్రమాదవశాత్తు ఇద్దరు గల్లంతయ్యారని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News March 25, 2025

ఉచిత ఇళ్లపై సీఎం కీలక ప్రకటన

image

AP: వచ్చే ఐదేళ్లలో అర్హులైన వారందరికీ ఇళ్లు మంజూరు చేస్తామని CM చంద్రబాబు తెలిపారు. గ్రామాల్లో 3, పట్టణాల్లో 2 సెంట్ల ఇంటి స్థలం ఇస్తామని కలెక్టర్ల సదస్సులో పునరుద్ఘాటించారు. ఇప్పటికే స్థలం పొందిన వారు కోరిన విధంగా ఇంటి పట్టాలు, నిర్మాణానికి ఆర్థిక సాయం అందించేలా ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. రెవెన్యూ సమస్యలను సత్వరమే పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు.

News March 25, 2025

అనుష్క ‘ఘాటి’ మూవీ రిలీజ్ వాయిదా!

image

క్రిష్ జాగర్లమూడి, అనుష్క కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఘాటి’. ఈ సినిమా విడుదల ఆలస్యం కానున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. వీఎఫ్ఎక్స్ పనులే ఆలస్యానికి కారణమని వెల్లడించాయి. వాస్తవానికి ఈ సినిమా ఏప్రిల్ 18న విడుదల కావాల్సి ఉంది. కొత్త రిలీజ్ డేట్‌ను త్వరలోనే వెల్లడించే అవకాశముంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌లో అనుష్క లుక్ భయపెట్టేలా ఉంది.

error: Content is protected !!