News February 24, 2025
పెండింగ్ కేసులను పరిష్కరించాలి: అనకాపల్లి ఎస్పీ

నిర్దిష్ట ప్రణాళికతో పాత పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హా పేర్కొన్నారు. జిల్లా కలెక్టరేట్లో సోమవారం జరిగిన నెలవారీ నేర సమీక్షలో ఆయన మాట్లాడారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ప్రణాళికాబద్ధంగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చార్జిషీట్లు, సమన్లు పెండింగ్లో లేకుండా చూడాలన్నారు.
Similar News
News January 7, 2026
HYD: 20ఎకరాల వేలం.. రూ.30 వేల కోట్ల లక్ష్యం

రూ.30 వేల కోట్ల సేకరణపై HMDA దృష్టి సారించింది. రూ.20వేల కోట్లను బాండ్ల వేలం ద్వారా సమకూర్చుకునేందుకు ప్రణాళికలు రూపొందిస్తుంది. వీటితోపాటు HMDA పరిధిలోని భూములను వేలం వేసి మిగతా ఆదాయాన్ని సమకూర్చుకునేలా చూస్తున్నారు. నియోపోలిస్ వద్ద 70, బంజారాహిల్స్లో 8, కొండాపూర్ వద్ద 20 ఎకరాలు వేలానికి సిద్ధం చేశారు. వచ్చిన ఆదాయంతో HMDA పరిధిలో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.
News January 7, 2026
నేడు విశాఖ కోర్టుకుహాజరు కానున్న మంత్రి నారా లోకేష్..

మంత్రి నారా లోకేష్ నేడు విశాఖ కోర్టుకు హాజరుకానున్నారు.ఓ దినపత్రికలో తనపై వచ్చిన ‘చినబాబు చిరుతిళ్లకు లక్షల ఖర్చు’ అనే కథనానికి వ్యతిరేకంగా ఆయన దాఖలు చేసిన పరువు నష్టం దావా విచారణ ఇవాళ జరగనుంది. 12వ అదనపు జిల్లా న్యాయస్థానంలో క్రాస్ ఎగ్జామినేషన్షన్ కు ఆయన హాజరుకానున్నారు ఇప్పటికీ రెండుసార్లు ఆయన హాజరయ్యారు.
News January 7, 2026
త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్?

APలో మరో మెగా DSCకి రంగం సిద్ధమవుతోంది. ఈ ఏడాది 9వేల మందికిపైగా టీచర్లు రిటైర్ కానున్నారు. అలాగే 9,200 ప్రైమరీ స్కూళ్లను ఆదర్శ పాఠశాలలుగా మార్చిన తర్వాత ఉపాధ్యాయులు అవసరమని అధికారులు గుర్తించారు. దీంతో FEB రెండో వారంలో నోటిఫికేషన్ విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈసారి DSCలో కొత్తగా ఇంగ్లిష్, కంప్యూటర్ పరిజ్ఞానంపై ఓ ఎగ్జామ్ నిర్వహించనున్నట్లు సమాచారం.


