News February 27, 2026

పెండింగ్ కేసులపై వేగం పెంచాలి: తిరుపతి SP

image

తిరుపతి జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన నేర సమీక్షలో ఎస్పీ సుబ్బారాయుడు పెండింగ్ కేసులను గడువులోపు పూర్తి చేసి చార్జ్‌షీట్లు దాఖలు చేయాలని ఆదేశించారు. మహిళలు, బాలలు, పోక్సో కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలని, సైబర్ నేరాలు, గాంజాపై జీరో టోలరెన్స్ విధానం అమలు చేయాలన్నారు. రౌడీషీటర్లపై నిఘా పెంచి అవసరమైతే పీడీ, PIT NDPS చట్టాల కింద చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.

Similar News

News March 2, 2026

HPV వ్యాక్సిన్ సేఫ్ కాదా?.. కేంద్రం క్లారిటీ

image

ఫ్రీ HPV వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్‌పై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని కేంద్రం ఖండించింది. ఈ టీకా కొత్తది కాదని 2006 నుంచే ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉందని స్పష్టం చేసింది. 2022 చివరి నాటికే ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల డోసుల పంపిణీ జరిగిందని, అనేక స్టడీలు ఇది సురక్షితమని తేల్చాయని వెల్లడించింది. 14 ఏళ్లలోపు బాలికలకు అందించే టీకా గర్భాశయ క్యాన్సర్ నుంచి 93-100% రక్షణ కల్పిస్తుందని తెలిపింది.

News March 2, 2026

కొండగట్టు ఈవోగా వేములవాడ ఈవోకి అదనపు బాధ్యతలు

image

కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానం కార్యనిర్వహణ అధికారిగా వేములవాడ రాజన్న ఆలయ ఈవో ఎల్ రమాదేవికి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇక్కడ ఈవోగా పనిచేసిన శ్రీకాంత్ రావుకు మన్యంకొండకు బదిలీ కావడం.. ఆ వెంటనే ఆయన సెలవుపై వెళ్లడంతో వేములవాడ ఈవో రమాదేవికి కొండగట్టు ఈవోగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

News March 2, 2026

వంటింటి చిట్కాలు.. ఈ పురుగులు చిరాకు తెప్పిస్తున్నాయా?

image

తడికి ఆకర్షితమయ్యే ఈ పురుగుల పేరు ‘ఫ్రూట్ ఫ్లైస్’. వంటగదిలో ఇవి చిరాకు తెప్పిస్తాయి. ఫ్లోర్, టేబుల్స్, సెల్ఫ్‌లపై ఎలాంటి పండ్ల రసాలు, ద్రవ పదార్థాలు చిల్లినా వస్తాయి. తడి చెత్త డబ్బా మంచి ఆవాస స్థానం. వీటి నివారణకు వంటగదిని పొడిగా ఉంచాలి. గిన్నెలు తోమిన తర్వాత తుడవాలి. కుళ్లిన పదార్థాలు వంటగదిలో ఉంచొద్దు. డస్ట్‌బిన్‌ రోజూ క్లియర్ చేయాలి. పండ్లు, కూరగాయలను మూత ఉన్న పాత్రలు, ఫ్రిజ్‌లో పెట్టాలి.