News September 22, 2025

పెండింగ్ పనులు ఒక్కొక్కటిగా పూర్తవుతున్నాయి: MP కావ్య

image

వరంగల్లో గత 30 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులు, కాంగ్రెస్ పాలనలో ఒక్కొక్కటిగా పూర్తి అవుతున్నాయని MP కడియం కావ్య అన్నారు. హనుమకొండలో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి-సంక్షేమ పథకాలను రెండు కళ్లుగా ముందుకు నడిపిస్తోందని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులపై వడ్డీలు కడుతూనే, కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను నిరంతరంగా అమలు చేస్తోందని అన్నారు.

Similar News

News September 22, 2025

ఆదిలాబాద్: SC శాఖలో బతుకమ్మ సంబరాలు

image

జిల్లాలో ఆయా సంబంధిత శాఖల్లో బతుకమ్మ సంబరాలు మంగళవారం నుంచి ప్రారంభించనున్నట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ముందుగా SC, BC, ST, మైనార్టీ సంక్షేమ శాఖలకు సంబంధించి SC డెవలప్‌మెంట్ కార్పొరేషన్ శాఖలో మంగళవారం సాయంత్రం 4 గంటలకు ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. బతుకమ్మ సంబరాలకు కమిటిని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అదనపు కలెక్టర్, ఛైర్మెన్, DWO, SC డెవలప్మెంట్, ప్రజా సంబంధాల శాఖ సభ్యులు ఉన్నారు.

News September 22, 2025

ADB: CM వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్

image

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావుతో కలిసి సోమవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ రాజర్షి షా, జిల్లా అటవీ శాఖ అధికారితో కలిసి కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలు నుంచి పాల్గొన్నారు. జాతీయ రహదారుల నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ ప్రక్రియను పూర్తి చేయాలని సీఎం, సీఎస్ సూచించారు.

News September 22, 2025

యువత అనవసరంగా తిరగడం మానేయాలి: ADB SP

image

నవరాత్రి ఉత్సవాల్లో మహిళలు ఎలాంటి అత్యవసర సమయంలోనైనా డయల్ 100 ద్వారా పోలీసు యంత్రాంగాన్ని సంప్రదించి సహాయాన్ని పొందవచ్చని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. రాత్రి సమయాల్లో యువత అనవసరంగా తిరగడం మానేయాలని సూచించారు. మహిళలు ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో యువత, తెలియని వారు వారిని వీడియోలు తీయడం, వికృత చేష్టలు చేస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు.