News November 13, 2025
పెండింగ్ పనులు పూర్తి చేయాలి: ADB కలెక్టర్

ప్రభుత్వ పాఠశాలల్లో పెండింగ్‌లో ఉన్న నిర్మాణ పనులు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. గురువారం నేరడిగొండ, భీంపూర్, బేలా, బోథ్, జైనథ్ మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్, కిచెన్ షెడ్, ప్రహరీగోడ, ఇతర మౌలిక సదుపాయాల పురోగతిపై రెండవ దశ సమీక్ష సమావేశం నిర్వహించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఆయనతో పాటు ITDA PA యువరాజ్ మర్మాట్ తదితరులు ఉన్నారు.
Similar News
News November 13, 2025
కుష్టు వ్యాధి రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి: కలెక్టర్

కుష్టువ్యాది నిర్మూలన కార్యాక్రమంలో భాగంగా వివిధ శాఖల సమన్వయంతో వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి రోగులను గుర్తించేందుకు ప్రత్యేక సర్వే చేశారు. జిల్లాను కుష్టు రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని కలెక్టర్ దినేష్ కుమార్ అధికారులకు ఆదేశించారు. ఈ మేరకు కలెక్టర్ కార్యాలయంలో ఈ వ్యాధి గుర్తింపు, నిర్ధారణకు జరిగిన కార్యక్రమంలో అధికారులతో సమీక్షించారు. అనంతరం గోడపత్రికను ఆవిష్కరించారు.
News November 13, 2025
యాదగిరిగుట్ట: కాలేజ్‌ను సందర్శించిన ఇంటర్ బోర్డు జాయింట్ సెక్రటరీ

యాదగిరిగుట్టలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఇంటర్మీడియట్ బోర్డు జాయింట్ సెక్రటరీ భీమ్ సింగ్ సందర్శించారు. ఇంటర్మీడియట్ బోర్డు కమిషనర్ కృష్ణ ఆదిత్య విద్యార్థుల ఉత్తీర్ణ శాతం పెంచడానికి ఆదేశించినటువంటి 90 రోజుల ప్రణాళిక గురించి కళాశాలలోని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు .ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ మంజుల, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.
News November 13, 2025
ఓయూ ICSI డీన్‌గా ప్రొ.అప్పారావు

ఓయూ వాణిజ్య విభాగం మాజీ ఆచార్యులు, వాణిజ్య ఫ్యాకల్టీ మాజీ డీన్, వాణిజ్య బోర్డు ఆఫ్ స్టడీస్ మాజీ చైర్మన్ ప్రొ.అప్పారావు దేశంలోని అత్యంత ప్రతిష్ఠాత్మకమైన వృత్తిపరమైన సంస్థలలో ఒకటైన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ICSI), న్యూఢిల్లీలో డీన్ (ఒప్పంద ప్రాతిపదికన)గా నియమితులయ్యారు. ఆయనను (ICSI-CCGRT-హైదరాబాద్) కేంద్రంలో నియమించారు. అధ్యాపకులు, విద్యార్థులు అభినందనలు తెలిపారు.


