News December 10, 2024
పెండింగ్ బిల్లులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి

ఉపాధ్యాయులకు పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు అనిల్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కామారెడ్డిలో టీపీటీఎఫ్ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయులకు దాదాపుగా 9 నెలలుగా పెండింగ్ లో ఉన్న బిల్లులను వెంటనే మంజూరు చేయాలని కోరారు. 2024 మార్చి నుంచి ఉద్యోగ విరమణ చెందిన ఉపాధ్యాయులకు బెనిఫిట్స్ ఇవ్వాలన్నారు.
Similar News
News February 20, 2026
NZB: నేషనల్ వాలీబాల్ పోటీలకు మనీష్ ఎంపిక

మోపాల్ మండలం కాంజర మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాల విద్యార్థి మనీష్ జాతీయ స్థాయికి ఎంపికయ్యాడు. 9వ తరగతి చదువుతున్న మనీష్, సబ్ జూనియర్ వాలీబాల్ (అండర్-16) విభాగంలో తన ప్రతిభ చాటి ఈ గౌరవం దక్కించుకున్నాడు. ఈ విషయాన్ని ప్రిన్సిపాల్ మురళి, పీఈటీ వినోద్ గర్వంగా ప్రకటించారు. మనీష్ సాధించిన ఈ విజయం పట్ల పాఠశాల సిబ్బంది, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.
News February 20, 2026
నిబంధనలు ఉల్లంఘించే స్కానింగ్ సెంటర్లపై చర్యలు: కలెక్టర్

నిబంధనలు ఉల్లంఘించే స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని NZB కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టర్ అధ్యక్షతన గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షల నిషేధ చట్టంపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో అన్ని ప్రమాణాలు పాటిస్తూ అర్హతలు ఉన్న స్కానింగ్ కేంద్రాలకు మాత్రమే రిజిస్ట్రేషన్ చేయాలన్నారు.
News February 20, 2026
పరీక్షల నిర్వహణలో CS, DOలదే ముఖ్య పాత్ర: DIEO

పరీక్షల నిర్వహణలో చీఫ్ సూపరింటెండెంట్లు (CS), డిపార్ట్మెంటల్ అధికారు(DO)లదే ముఖ్య పాత్ర అని జిల్లా ఇంటర్
విద్యా అధికారి (DIEO) రవికుమార్ అన్నారు. శుక్రవారం ఖిల్లా జూనియర్ కళాశాలలో CS, DOలతో నిర్వహించిన సమీక్షలో DIEO మాట్లాడుతూ.. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే ఇంటర్ బోర్డు కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు. బోర్డు కమిషనర్, జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఇంటర్ పరీక్షల నిర్వహణకు చర్యలు తీసుకుందన్నారు.


