News November 1, 2025

పెండింగ్ రెవెన్యూ సమస్యలు పరిష్కరించాలి: కలెక్టర్

image

నల్గొండ జిల్లాలలో పెండింగ్‌లో ఉన్న వివిధ రెవెన్యూ దరఖాస్తులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని కలెక్టర్‌ ఇలా త్రిపాఠి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం రెవెన్యూ అంశాలపై ఆమె అధికారులతో సమీక్ష నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న భూ రికార్డులు, భూ భారతి, భూ వివాదాల దరఖాస్తుల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.

Similar News

News November 1, 2025

పెద్దవూర పోలీస్ స్టేషన్‌ను ఆకస్మిక తనిఖీ చేసిన ఎస్పీ

image

పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదులలో ఎటువంటి జాప్యం చేయకుండా తక్షణమే స్పందించి, బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. మిర్యాలగూడ సబ్ డివిజన్ పరిధిలోని పెద్దవూర పోలీస్ స్టేషన్‌ను శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి, సిబ్బంది పనితీరు, పోలీస్ స్టేషన్ పరిధిలోని భౌగోళిక వివరాల గురించి ఎస్సైని అడిగి తెలుసుకున్నారు.

News October 31, 2025

NLG: ఉదయం బదిలీ… మధ్యాహ్నం డిప్యూటేషన్!

image

నల్గొండలోని జిల్లా స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖలో అక్రమ బదిలీల వ్యవహారం కలకలం రేపుతుంది. ఇక్కడ పనిచేస్తున్న ఓ ఉద్యోగిని మరో చోటికి ఉదయం బదిలీ చేసి మధ్యాహ్నం డిప్యూటేషన్ పై మళ్లీ ఇక్కడికే తీసుకురావడం చర్చనీయాంశంగా మారింది. గంటల వ్యవధిలోనే తిరిగి సదరు ఉద్యోగికి యధాతధ పోస్టు అప్పగించడంపై తోటి ఉద్యోగులు మండిపడుతున్నారు. ఆ ఉద్యోగి అక్రమాలపై ప్రభుత్వం విచారణ చేయాలని కోరుతున్నారు.

News October 31, 2025

NLG: శిశు విక్రయాలకు అడ్డుకట్టపడేదెప్పుడో!

image

జిల్లాలో శిశు విక్రయాలు కలకలం రేపుతున్నాయి. పేదరికం, నిరక్షరాస్యత, అధిక సంతానం కారణంగానే జిల్లాలో ఎక్కువగా గిరిజన తండాల్లో శిశు విక్రయ ఘటనలు తరుచూ వెలుగు చూస్తున్నాయి. ఎవరికీ తెలియకుండానే పసిపిల్లల విక్రయాలు సాగుతున్నాయన్న చర్చ జరుగుతోంది. జిల్లాలో 2020 నుంచి ఇప్పటివరకు సుమారుగా 52 శిశు విక్రయాలు జరిగినట్లు తెలుస్తుంది. శిశువిక్రయాలకు అడ్డుకట్ట వేయాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.