News April 10, 2024
పెందుర్తిలో ఎవరు గెలిచినా రికార్డే..!

పెందుర్తి నియోజకవర్గం 1978లో ఏర్పడింది. అప్పటి నుంచి 11 సార్లు ఎన్నికలు జరగగా.. 11 సార్లు వేర్వేరు అభ్యర్థులే గెలిచారు. ఈ సారి వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే అదీప్ రాజ్ మరోసారి పోటీలో ఉండగా, ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా జనసేన నేత పంచకర్ల రమేశ్ బరిలో ఉన్నారు. అయితే పంచకర్ల 2009లో పీఆర్పీ నుంచి గెలిచారు. దీంతో వీరిలో ఎవరు గెలిచినా పెందుర్తిలో రెండోసారి గెలిచిన వ్యక్తిగా రికార్డు సృష్టించనున్నారు.
Similar News
News October 5, 2025
పెద్దిపాలెం హైవేపై యాక్సిడెంట్.. మహిళ మృతి

ఆనందపురం మండలం పెద్దిపాలెం జాతీయ రహదారిపై శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. భోగాపురం నుంచి మధురవాడ వైపు ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న సన్యాసమ్మ (41) హఠాత్తుగా పడిపోవడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలు కొమ్మాది ప్రాంతానికి చెందిన రామసూరి భార్యగా పోలీసులు గుర్తించారు. ఘటనపై ఆనందపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News October 5, 2025
దసరా రద్దీ నియంత్రణ కోసం భోగీలు పెంచిన రైల్వే అధికారులు 2/1

దసరా రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రయాణికుల సౌకర్యార్ధం అక్టోబర్ 1 నుంచి 31వ తేదీ వరకు పలు ట్రైన్‌లలో అదనపు భోగీలు పెంచినట్లు రైల్వే అధికారులు తెలిపారు.
➤18526/18525 విశాఖపట్నం- బరంపూర్-విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ – 2 భోగీలు
➤22820/22819 విశాఖపట్నం- భువనేశ్వర్-విశాఖపట్నం ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ – 2 భోగీలు
➤18512/18511 విశాఖపట్నం-కోరాపుట్-విశాఖపట్నం ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ – 2 భోగీలు
News October 5, 2025
దసరా రద్దీ నియంత్రణ కోసం భోగీలు పెంచిన రైల్వే అధికారులు 2/2

➤58528/58527 విశాఖ -రాయపూర్- విశాఖ ప్యాసింజర్ – 2 భోగీలు
➤58538/58537 విశాఖపట్నం -కోరాపుట్- విశాఖపట్నం ప్యాసింజర్- 2 భోగీలు
➤58532/58531 విశాఖపట్నం -బరంపూర్- విశాఖపట్నం ప్యాసింజర్-1 భోగీ
➤58504/58503 విశాఖపట్నం -భవానిపట్న- విశాఖపట్నం ప్యాసింజర్- 2 భోగీలు
➤58506/58505 విశాఖపట్నం -గుణుపూర్- విశాఖపట్నం ప్యాసింజర్ – స్లీపర్ భోగి-1, జనరల్ భోగి -1
ఈ సేవలను వినియోగించుకోవాలని కోరారు.