News December 29, 2024
పెందుర్తి: ఉరి వేసుకుని సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య
పెందుర్తి మండలం చినముషిడివాడ కార్మికనగర్ ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమ విఫలం కావడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు భావిస్తున్నారు. మృతుడు హైదరాబాద్‌కు చెందిన పీవీ శ్రీకాంత్‌గా పోలీసులు గుర్తించారు. కుటుంబసభ్యులకు ముందుగానే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సమాచారం ఇచ్చాడు. కాగా..శ్రీకాంత్ అదృశ్యం అయినట్లు శనివారం హైదరాబాదులో కేసు నమోదయింది.
Similar News
News December 29, 2024
ఆస్ట్రేలియాలో సెల్ఫీలు అడుగుతున్నారు: నితీశ్ తండ్రి
విశాఖ కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్‌లో సెంచరీ చేసిన విషయం తెలిసిందే. దీంతో అతని తండ్రి ముత్యాలరెడ్డి ఆనందానికి హద్దులే లేవు. ఉంటున్న ప్రాంతంలోని వారికే నేను ఎవరో తెలీదు అలాంటిది ఇప్పుడు ఆస్ట్రేలియాలోనే సెల్ఫీలు అడుగుతున్నారంటూ మురిసిపోయారు. ఆస్ట్రేలియా వచ్చినప్పడు ఇంత దూరం వచ్చినందుకు గర్వపడుతున్నా అనగా ఇది చాలదు ఇంకా చూపిస్తా అంటూ 24 గంటల్లోనే సెంచరీ చేశాడన్నారు.
News December 29, 2024
విశాఖ: ‘సంక్రాంతికి 800 బస్సు సర్వీసులు’
సంక్రాంతి సీజన్‌లో ఉత్తరాంధ్రకు 800 ట్రిప్పులు ఆర్టీసీ బస్సులు నడిపేందుకు ప్రణాళికను రూపొందించినట్లు విశాఖ జిల్లా ప్రజా రవాణా అధికారి బి.అప్పలనాయుడు తెలిపారు. శనివారం ఆయన విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్‌లో మాట్లాడుతూ హైదరాబాద్ విజయవాడ భీమవరం తదితర ప్రాంతాలకు కూడా ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు పేర్కొన్నారు. వచ్చే నెల 10వ తేదీ నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులు అందుబాటులోకి వస్తాయన్నారు.
News December 29, 2024
సముద్రంలో ఈదుకుంటూ విశాఖ నుంచి కాకినాడకు
విశాఖ నుంచి కాకినాడ వరకు సముద్రంలో దాదాపు 150 కిలోమీటర్ల మేర ఈదుతూ ప్రయాణించేందుకు శ్యామల గోలి సాహసయాత్రను ప్రారంభించారు. ఈ సందర్బంగా విశాఖ ఎంపీ శ్రీభరత్, గండి బాబ్జి పాల్గొని ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సాహస యాత్ర ఆమె ఆత్మవిశ్వాసానికి, మహిళల శక్తికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. ఒక్క రోజులో దాదాపు 30 కిలోమీటర్లు పాటు ఈదుతూ 5 రోజుల్లో పూర్తి చేయాలనే లక్ష్యంతో శ్యామల గోలి ప్రణాళిక రూపొందించారు.