News April 19, 2024
పెందుర్తి: ఏసీబీకి చిక్కిన పంచాయతీ అధికారులు

విశాఖపట్నం పెందుర్తిలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. పెందుర్తి పంచాయతీ కార్యాలయంలో అవినీతికి పాల్పడుతున్న ఇద్దరు అధికారులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పంచాయతీ సెక్రటరీ వి. సత్యనారాయణ, అసిస్టెంట్ పవన్ రూ.8 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. అయితే ఇంటి ప్లాన్ అనుమతి కొరకు నిందితులు లంచం డిమాండ్ చేశారు. లంచం ఇవ్వడం ఇష్టం లేని సదరు వ్యక్తి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.
Similar News
News October 9, 2025
హోమ్ స్టే విధానంపై పర్యాటక శాఖ వర్క్‌షాప్

విశాఖలో హోమ్ స్టే, బెడ్ & బ్రేక్‌ఫాస్ట్ విధానాలపై అక్టోబర్ 10న ఉదయం 10 గంటలకు VMRDA చిల్డ్రన్ ఎరీనాలో పర్యాటక శాఖ అవగాహన సదస్సు నిర్వహిస్తోంది. సొంత ఇళ్లలో కొంత భాగాన్ని పర్యాటకులకు వసతిగా కల్పించి, ఆదాయం పొందాలనుకునే వారికి ఇది చక్కటి అవకాశమని జిల్లా పర్యాటక అధికారి తెలిపారు. ఆసక్తిగల పౌరులు హాజరై పూర్తి వివరాలు తెలుసుకోవాలని ఆయన కోరారు.
News October 8, 2025
కేజీహెచ్‌లో 46 మంది విద్యార్థులకు చికిత్స

కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న కురుపాం బాలికల సంఖ్య 46కి తగ్గింది. మొత్తం 64 మంది ఆస్పత్రిలో చేరగా.. వీరిలో మంగళవారం 8 మందిని డిశ్చార్జ్ చేసి పార్వతీపురం ఆసుపత్రికి తరలించారు. బుధవారం మరో 10 మందిని డిశ్చార్జ్ చేసినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఐ.వాణి తెలిపారు. ప్రస్తుతం 46 మంది విద్యార్థులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ఆమె వెల్లడించారు.
News October 8, 2025
విశాఖ రైల్వే స్టేషన్‌లో అమ్రిత్ సంవాద్ కార్యక్రమం

విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో బుధవారం వాల్తేర్ డివిజన్ రైల్వే అధికారి ‘అమ్రిత్ సంవాద్’ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో సీనియర్ డీసీఎం పవన్ కుమార్ ప్రయాణికులతో నేరుగా మాట్లాడి సూచనలు, అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. కొందరు ప్రయాణికులు ఎస్కలేటర్ వద్ద వృద్ధుల కోసం కేర్ టేకర్, రైలులో మగ, ఆడవాళ్లకి వేర్వేరుగా బాత్రూం ఏర్పాటు చేయాలని సూచించారు.