News January 26, 2025

పెందుర్తి: బాల్కనీ నుంచి జారిపడి వ్యక్తి మృతి

image

పెందుర్తిలో గల అప్పన్నపాలెంలో శనివారం విషాదం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసం ఉంటున్న వెంకట సత్యనారాయణ ఇంటి బాల్కనీ నుంచి పడి మృతి చెందారు. వెంటనే భార్య హాస్పిటల్‌కు తరలించారు. తీవ్ర గాయాలవ్వడంతో అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. వెంకట సత్యనారాయణ జీవీఎంసీ జోన్ -8 వేపగుంట కార్యాలయంలో బిల్ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.

Similar News

News January 27, 2025

తగరపువలస ఘటనలో మరో చిన్నారి మృతి

image

తగరపువలసలోని ఆదర్శనగర్‌లో పురుగుమందు తాగిన ఘటనలో <<15257483>>విషాదం <<>>చోటుచేసుకుంది. చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం ఇషిత(5) మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఇటీవల భార్యాభర్తల గొడవతో మనస్తాపం చెందిన వివాహిత మాధవి(25) ఇద్దరి కుమార్తెలతో పాటు పురుగు మందు తాగిన విషయం తెలిసిందే. దీంతో మాధవితో పాటు చిన్న కుమార్తె శనివారం మృతి చెందింది. మృతిరాలి భర్త రామకృష్ణ ప్రైవేట్ పరిశ్రమలో ఉద్యోగా పనిచేస్తున్నాడు.

News January 27, 2025

విశాఖ కలెక్టర్ బంగ్లాలో హై-టీ వేడుకలు

image

గ‌ణ‌తంత్ర దినోత్స‌వం సందర్భంగా ఆదివారం సాయంత్రం కలెక్టర్ బంగ్లాలో హై-టీ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలలో ప‌ద్మ శ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ కూటికుప్పల సూర్యరావు, రాజ‌కీయ ప్ర‌ముఖులు, నేవీ అధికారులు, పోలీస్ అధికారులు, జిల్లా అధికారులు వేడుక‌ల్లో భాగ‌స్వామ్యం అయ్యారు. ఈ కార్య‌క్ర‌మంలో ముందుగా చిన్నారులు నిర్వ‌‌హించిన సాంస్కృతిక ప్ర‌ద‌ర్శ‌న‌లు, ఆక‌ట్టుకున్నాయి.

News January 26, 2025

విశాఖలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం 

image

విశాఖలోని ఆశీల్‌మెట్టలో యువకుడి మృతదేహం లభ్యమైంది. త్రీ టౌన్ ఎస్‌ఐ సురేష్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం ఉదయం ఓ స్కూల్ గేట్ ఎదురుగా మృతదేహం ఉన్నట్లు స్థానికులు సమాచారం అందించారని తెలిపారు. మృతుడి వయసు సుమారు 25 నుంచి 30 సంవత్సరాలు ఉంటుందని పేర్కొన్నారు. మృతదేహాన్ని కేజీహెచ్ మార్చురీకి తరలించినట్లు తెలిపారు. మృతుని వివరాలు తెలిస్తే తమను సంప్రదించాలని ఎస్‌ఐ సురేష్ కోరారు.