News March 21, 2025
పెంబి: అన్నం పెట్టలేదని భార్యను చంపాడు!

అన్నం పెట్టడం లేదని భార్యని చంపాడో భర్త. ఖానాపూర్ పోలీసుల వివరాలు.. పెంబి పరిధిలోని దాసునాయక్ తండాకి చెందిన అర్జున్‌కు గోసంపల్లికి చెందిన నిరోజతో వివాహం జరిగింది. కాగా భర్త మద్యానికి బానిసై రోజు గొడవపడే వాడు. ఈ నెల 18న మద్యం తాగి వచ్చి భోజనం పెట్టలేదని గొడవపడ్డాడు. నిరోజను కిందపడేసి కొట్టి, గొంతుపై కాలువేసి తొక్కడంతో ఆమె మృతిచెందింది. నిరోజ అన్న ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని అరెస్ట్ చేశారు.
Similar News
News March 28, 2025
SKLM: జిల్లా కలెక్టర్‌ను కలిసిన ఎచ్చెర్ల ఎమ్మెల్యే

శ్రీకాకుళం కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టరు స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌ను శుక్రవారం సాయంత్రం ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు సంబంధించిన పలు పెండింగ్‌లో ఉన్న పనులపై కలెక్టర్‌తో ఎమ్మెల్యే చర్చించారు. త్వరితగతిన పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
News March 28, 2025
అల్లూరి జిల్లాలో టుడే టాప్ న్యూస్

>అల్లూరి జిల్లాలో భానుడి ప్రతాపం
>పాడేరు: సోషల్ స్టడీస్ పరీక్ష తేదీ మార్పు
>అడ్డతీగల: ప్రతీ ఏకలవ్య మోడల్ పాఠశాలలో భూసార పరీక్షా కేంద్రం
>పర్యాటకులు లేక బోసిపోయిన చాపరాయి జలపాతం
>పాడేరు: 10 మంది మావోయిస్టులు లొంగుబాటు
>రంపచోడవరం: ఉగాదికి శ్రీవారి లడ్డూ ప్రసాదం
>డ్రోన్ ద్వారా సాగు విధానంపై అవగాహన
>అల్లూరి జిల్లాలో పది పరీక్షలకు 99 మంది దూరం
News March 28, 2025
ధోనీ క్రేజ్ వల్ల చెన్నైకి దెబ్బే: అంబటి రాయుడు

భారీగా పెరుగుతున్న ధోనీ మేనియా సీఎస్కేకు మంచిది కాదని అంబటి రాయుడు ఓ ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు. ‘చాలా మంది అభిమానులు ధోనీ బ్యాటింగ్ చూసేందుకే స్టేడియానికి వస్తుంటారు. వారు సీఎస్కే టీమ్‌లోని మిగతా బ్యాటర్లు త్వరగా ఔటై వెళ్లిపోవాలని కోరుకుంటారు. కొత్త ఆటగాళ్లకు ఇది చాలా ఇబ్బంది కలిగిస్తుంది. దీనివల్ల చెన్నైకి కొత్త నాయకుడు తయారు కావడం కష్టం అవుతుంది’ అని చెప్పారు.