News September 23, 2025

పెంబి: జేపీఎస్‌లకు ఈగోస

image

మొబైల్ సిగ్నల్స్ సరిగా లేకపోవడంతో పెంబి మండలంలో పంచాయతీ కార్యదర్శులు(జేపీఎస్‌లు) తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇందిరమ్మ ఇళ్ల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసేందుకు వారు చెట్లు, పుట్టలు, ఇళ్లపైకి ఎక్కి ఫోటోలు తీయాల్సిన దుస్థితి నెలకొంది. అధికారులు స్పందించి తక్షణమే సిగ్నల్స్ రూటర్లు ఏర్పాటు చేయాలని జేపీఎస్‌లు కోరుతున్నారు.

Similar News

News September 23, 2025

పి. గన్నవరంలో టీడీపీ ఇన్‌‌ఛార్జ్ పదవిపై గందరగోళం

image

పి. గన్నవరం నియోజకవర్గంలో ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్న టీడీపీ ఇన్‌‌ఛార్జ్ పదవి ఎవరికి దక్కుతుందో తెలియక పార్టీ కార్యకర్తలు గందరగోళానికి గురవుతున్నారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని వెంటనే నియమించాలని ఎస్సీ వర్గానికి చెందిన టీడీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం నియోజకవర్గ త్రిసభ్య కమిటీ కన్వీనర్‌గా మాజీ జడ్పీ ఛైర్మన్ నామన రాంబాబు కొనసాగుతున్నారు.

News September 23, 2025

కోళ్ల దాణా నిల్వలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

image

కోళ్లకు మంచి దాణా అందించినప్పుడే వాటి పెరుగుదల బాగుంటుంది. అయితే దాణా నిల్వలోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వెటర్నరీ అధికారులు సూచిస్తున్నారు. దాణా బస్తాలను నేలపై కాకుండా చెక్క పలకల మీద ఉంచాలి. గోడలకు తగలకుండా చూడాలి. తేమగా ఉన్న దాణాను నిల్వ చేయకూడదు. 2-3వారాలకు మించి దాణా నిల్వ ఉంచకూడదు. వేడిగా ఉన్న దాణాను చల్లబడిన తర్వాత మాత్రమే గోదాముల్లో నిల్వ ఉంచాలి. లేదంటే బస్తాలపై తేమ ఏర్పడి బూజు పడుతుంది.

News September 23, 2025

నెల్లూరు: రెండు డైరెక్టర్ పదవులు ఏకగ్రీవం

image

నెల్లూరు విజయ డెయిరీలో రెండు మహిళా డైరెక్టర్ పదవులు ఏకగ్రీవమయ్యాయి. ఈ మేరకు ఆ రెండు పదవులకు ఇద్దరు మహిళలు మాత్రమే నామినేషన్ దాఖాలు చేశారు. దీంతో ఆ రెండు పదవులు ఏకగ్రీవమాయ్యాయి. వీటిల్లో కొడవలూరు మండలం రేగడిచెలికకు చెందిన గుర్రం నాగేశ్వరమ్మ, బాలాయపల్లి మండలం వెంగమాబాపురం పాల సొసైటీకి చెందిన సాయి నిరోషా ఏకగ్రీవమయ్యారు. అయితే ఎన్నికల అధికారి వీరి పదవులను అధికారికంగా ప్రకటించనున్నారు.