News December 10, 2025

పెంబి: తెప్పపై తరలివెళ్లిన ఎన్నికల సిబ్బంది

image

ఈ నెల 11న నిర్వహించనున్న పంచాయతీ ఎన్నికల్లో భాగంగా జిల్లా ఎన్నికల పరిశీలకురాలు ఆయేషా మసరత్ ఖానం పెంబి మండలాన్ని సందర్శించారు. సిబ్బంది ఎన్నికల సామగ్రితో కేంద్రాలకు తరలివెళ్లారు. యాపాల్ గూడకు వెళ్లాల్సిన సిబ్బందిని గ్రామంలోని నది వద్ద తెప్పపై సామగ్రితో దగ్గరుండి తరలించారు.

Similar News

News December 11, 2025

పల్నాడులో తీవ్ర ఉత్కంఠ

image

పిన్నెల్లి సోదరుల లొంగుబాటు, మాచవరం ఎంపీపీ ఎన్నిక నేపథ్యంలో గురువారం పల్నాడులో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. పిన్నెల్లికి సంఘీభావం తెలపాలని వైసీపీ పిలుపునిచ్చింది. అయితే గురజాల సబ్‌డివిజన్ పరిధిలో 144 సెక్షన్ అమలులో ఉన్నందున ర్యాలీలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఏం జరుగుతుందోనని ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు.

News December 11, 2025

చిత్తూరు: మైనర్‌ బాలికపై అత్యాచారం.. 20 ఏళ్లు జైలు శిక్ష

image

మైనర్ బాలికపై అత్యాచారం కేసులో నిందితుడికి కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.4,100 జరిమానాను కోర్టు విధించినట్లు పోలీసులు తెలిపారు. వారి వివరాల మేరకు వెదురుకుప్పం(M) వెంగనపల్లెకు చెందిన మణి ఓ మైనర్ బాలికను ప్రేమించాలని వేధించాడు. 2020లో ఆమెను భయపెట్టి భాకరాపేటకు తీసుకువెళ్లి వివాహం చేసుకున్నాడు. అనంతరం పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదైంది.

News December 11, 2025

BREAKING: గిద్దలూరు మాజీ MLA మృతి

image

గిద్దలూరు మాజీ MLA పిడతల రామ్ భూపాల్ రెడ్డి (89) స్వర్గస్థులయ్యారు. వయో భారంతో అనారోగ్య సమస్యలతో బాధపడుతూ హైదరాబాదులోని ప్రైవేట్ వైద్యశాలలో చికిత్స పొందుతున్న రామ్ భూపాల్ రెడ్డి ఈ తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. రామ భూపాల్ రెడ్డి TDP నుంచి పోటీ చేసి 1994లో MLAగా ఎన్నికయ్యారు. ఆయన కుమారుడు పిడతల ప్రవీణ్ కుమార్ రెడ్డి వైసీపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్‌గా బాధ్యతలను నిర్వహిస్తున్నారు.