News March 14, 2026
పెట్రోల్, డీజిల్‌ను నిల్వ చేస్తున్నారా?

యుద్ధం కారణంగా ఇంధనం కొరత రావొచ్చనే భయంతో చాలా మంది పెట్రోల్, డీజిల్‌ను విడిగా తీసుకెళ్లి నిల్వ చేసుకుంటున్నారు. అయితే దేశంలో సరిపడా నిల్వలు ఉన్నాయని, ప్రజలు ఆందోళన చెందవద్దని కేంద్రం ప్రకటించింది. నిల్వల వల్ల అగ్ని ప్రమాదాలు జరగొచ్చని హెచ్చరించింది. నిబంధనలు ఉల్లంఘించే పెట్రోల్ బంకులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. వాహనాల్లో మాత్రమే ఇంధనం నింపుకోవాలని సూచించింది.
Similar News
News April 7, 2026
రాజ్ కసిరెడ్డికి బెయిల్

AP: మద్యం కుంభకోణం కేసులో ఏ1 రాజ్ కసిరెడ్డికి హైకోర్టు పలు షరతులతో బెయిల్ మంజూరు చేసింది. పోలీసుల విచారణకు సహకరించాలని, దేశం విడిచి వెళ్లొద్దని స్పష్టం చేసింది. దాదాపు ఏడాదిగా ఆయన జైలులో ఉన్నారు. ఇదే కేసులోని పలువురు నిందితులకు ఇప్పటికే బెయిల్ వచ్చిన విషయం తెలిసిందే.
News April 7, 2026
అభివృద్ధి, సంక్షేమం ఎలా ఉంటాయో తెలంగాణకు వచ్చి చూసుకోండి: CM

కేరళంలో 120 నెలల పినరయి విజయన్ పాలన వైఫల్యానికి ప్రతీకగా నిలిచిందని TG CM రేవంత్ విమర్శించారు. ‘పినరయిని తెలంగాణకు ఆహ్వానిస్తున్నా. తెలంగాణలోని ఏ మూలకైనా వెళ్లి మేం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వారు పరిశీలించవచ్చు. 67 వేల ఉద్యోగాలు ఇచ్చాం. రూ.20,670 కోట్ల రుణమాఫీ చేశాం. 4 లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చాం. ఉచిత విద్యుత్ ఇస్తున్నాం’ అని కోవలంలో వ్యాఖ్యానించారు.
News April 7, 2026
పవర్ ప్లాంట్ల చుట్టూ మానవ హారాలు.. యువతకు ఇరాన్ పిలుపు

‘హార్ముజ్’ను తెరవకపోతే ఇరాన్‌లోని బ్రిడ్జిలు, విద్యుత్ కేంద్రాలపై దాడి చేస్తామని ట్రంప్ హెచ్చరించారు. ఇందుకు ఇచ్చిన గడువు కొన్ని గంటల్లో ముగియనుంది. ఈ క్రమంలో దేశంలోని పవర్ ప్లాంట్ల వద్ద మానవ హారాలుగా నిలబడాలని యువత సహా అని వర్గాల ప్రజలకు ఇరాన్ ప్రభుత్వం పిలుపునిచ్చింది. మౌలిక సదుపాయాలను రక్షించుకోవడమే లక్ష్యంగా ఈ ప్లాన్ వేసింది. పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్లపై దాడిని యుద్ధ నేరంగా అభివర్ణించింది.


