News March 27, 2026

పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపు

image

పెట్రోల్, డీజిల్‌పై అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీని తగ్గిస్తున్నట్లు కేంద్రప్రభుత్వం ప్రకటించింది. పెట్రోల్‌పై గతంలో రూ.13 ఉంటే రూ.3కు, డీజిల్‌పై రూ.10 ఉంటే ఇప్పుడు సున్నాకు తగ్గించినట్లు వెల్లడించింది. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గే అవకాశం ఉంది. HPCL, IOCL, BPCL షేర్లు భారీగా లాభపడనున్నాయి.

Similar News

News April 13, 2026

నిధులిచ్చాం.. తేడా వస్తే మీ తప్పే: చంద్రబాబు

image

AP: పాఠశాలల పునః ప్రారంభం నాటికి ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లన్నీ పూర్తి వసతులతో సిద్ధంగా ఉండాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ప్రతి హాస్టల్ గాడిలో పడాలని… అన్ని రకాల వసతులు ఉండాలని సమీక్షలో స్పష్టం చేశారు. ఇప్పటికే నిధులు అందించామని అయినా ఫిర్యాదులు వస్తే అది అధికారుల తప్పిదమే అవుతుందన్నారు. హాస్టళ్లలో ఆహారం, నీటి సరఫరా, పారిశుద్ధ్యం విషయంలో తేడా రాకుండా చూసుకోవాలని సూచించారు.

రిటైర్డ్ ఉద్యోగులకు అలర్ట్.. ఏప్రిల్ 30 వరకే..

image

AP: వివిధ శాఖల్లో రిటైరైన ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ తదితరాలకు సంబంధించిన ఫైళ్లను మే1 నుంచి ఆన్‌లైన్(నిధి పోర్టల్)లోనే సమర్పించాల్సి ఉంటుంది. ఆర్థిక శాఖ ఈమేరకు ఉత్తర్వులు జారీచేసింది. రిటైరైన ఉద్యోగుల పెన్షన్ ఫైళ్ల ఫిజికల్ కాపీలను APR30 వరకు మాత్రమే స్వీకరిస్తామని పేర్కొంది. ఆ తరువాత ఆఫ్‌లైన్‌లో అనుమతించేది లేదని తెలిపింది. రిటైర్డ్ ఉద్యోగులకు ఇబ్బందులు రాకుండా దీన్ని గుర్తుంచుకోవాలని సూచించింది.