News November 13, 2024
పెదకాకానిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు
పెదకాకాని మండలంలో గుంటూరు కలెక్టర్ నాగలక్ష్మి బుధవారం పర్యటించారు. మండల కేంద్రంలోని గౌడపాలెం అంగన్వాడీని సందర్శించి ఇంకుడు గుంట ఏర్పాట్లను పరిశీలించారు. కేంద్రంలోని వసతులు, విద్య, టాయిలెట్లు, ఆహార పదార్థాలు, వాటి నాణ్యత గురించి అంగన్వాడీ టీచర్, ఆయాలను అడిగి తెలుసుకున్నారు. పెదకాకాని మండలంలోని పుష్పరాజ్ కాలనీ సీసీ రోడ్డు ఏర్పాట్లను పరిశీలించారు.
Similar News
News December 3, 2024
అది ఉప్పు సత్యాగ్రహం అయితే… ఇది పల్నాటి సత్యాగ్రహం
పల్నాడు సత్యాగ్రహం దేశ స్వాతంత్ర్యోద్యమ సమయంలో మన జిల్లాలో జరిగిన ఉద్యమం.1921లో కరువు వచ్చింది. ప్రజలు తాము అటవీ ఉత్పత్తులను ఉచితంగా వినియోగించుకోవడానికి ప్రభుత్వాన్ని అనుమతి కోరారు. దానికి ప్రభుత్వం అంగీకరించక పశువుల్ని బంధించటంతో ప్రజలకు పోలీసులకు మధ్య ఘర్షణ జరిగింది.1921 సెప్టెంబర్ 23న జరిగిన కాల్పుల్లో పల్నాటి ప్రజానాయకుడు <<14782225>>కన్నెగంటి <<>>హనుమంతు, మరో ముగ్గురు మరణించారు. దీంతో ఉద్యమం ఆగిపోయింది
News December 3, 2024
ఫేస్‌బుక్ పరిచయం.. మహిళను ముంచేసింది
ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన వ్యక్తి తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడంటూ ఓ మహిళ గుంటూరు ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. బాధితురాలు చెప్పిన వివరాల మేరకు.. బాలాజీ నగర్‌లో ఉంటున్న మహిళకు గతంలో వివాహమైంది. ప్రస్తుతం ఓ దుకాణంలో సేల్స్ విభాగంలో పని చేస్తోంది. ఫేస్‌బుక్ ద్వారా ప్రొద్దుటూరుకి చెందిన ఓ వ్యక్తి పరిచయమై పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. రూ.17 లక్షలు ఆమె నుంచి తీసుకుని మొహం చాటేశాడు.
News December 3, 2024
గుంటూరు: ‘YCP నేత బెదిరించి నన్ను అత్యాచారం చేశాడు’
వెంగళాయపాలెంకు చెందిన వైసీపీ నాయకుడు నాగేశ్వరరావు తన నగ్న వీడియోలతో బెదిరించి అఘాయిత్యం చేయడమే కాకుండా నెలకు రూ.4వేలు తీసుకున్నాడని బాధితురాలు గుంటూరు SPకి ఫిర్యాదు చేసింది. తన తినుబండారాల దుకాణంలో చోరీ చేసిన వ్యక్తిని తనకున్న పలుకుబడితో పట్టిస్తానని పరిచయం పెంచుకున్నాడని చెప్పింది. వ్యాపారాలు లేక డబ్బు ఇవ్వకపోవడంతో తనపై దాడి చేశాడని, దీంతో జరిగిన విషయాన్ని తన భర్తకు చెప్పి ఫిర్యాదు చేశానన్నారు.