News December 29, 2024

పెదకాకాని: మహిళ అనుమానాస్పద మృతి

image

పెదకాకాని(M) నంబూరులో మల్లికా(29) అనే మహిళ శనివారం రాత్రి అనుమానాస్పదంగా మృతి చెందింది. పోలీసుల వివరాల మేరకు.. మల్లిక మొదటి భర్తతో విడిపోయి ప్రేమ్ కుమార్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. భర్త పనికి వెళ్లి తిరిగి వచ్చేసరికి భార్య మంచంపై శవమై ఉంది. మెడ మీద గాయాలు ఉండటంతో పలు అనుమానాలకు దారితీస్తుందన్నారు. సీసీ కెమెరాలో ఇద్దరు మాస్కులు ధరించి వచ్చి వెళ్లినట్లు గమనించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News January 1, 2025

వినుకొండలో న్యూఇయర్ వేడుకలు.. PIC OF THE DAY

image

వినుకొండలో విద్యార్థులు నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో మంగళవారం రంగవల్లిని అందంగా అలంకరించారు. లైట్లు వెలిగించి వాటి చుట్టూ క్యాండిల్స్ వెలిగించారు. అనంతరం రంగవల్లుల చుట్టూ విద్యార్థులు మానవహారం నిర్వహించారు. దీంతో రంగవల్లి చుట్టూ ఉన్న చిన్నారుల ఫొటో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

News December 31, 2024

న్యూయర్ వేడుకలకు గుంటూరు సర్వం సిద్ధం

image

ఉమ్మడి గుంటూరులో న్యూయర్ వేడుకలకు యువత సిద్ధమైంది. గతంతో పోలిస్తే ఈ వేడుకల్లో ఎంతో తేడా కనిపిస్తుంది. 10ఏళ్ల కిందట వరకు గ్రీటింగ్ కార్డ్స్ పంచుకుంటూ శుభాకంక్షలు తెలిపేవారు. హైటెక్ యుగంలో వాట్సాప్ ద్వారా విషెస్ తెలుపుకుంటున్నారు. రంగురంగుల లైట్లతో నగరం, పల్లెలు మెరిసిపోతుండగా ఇళ్ల ముందు ముగ్గులతో పల్లెలు కళకళలాడుతున్నాయి. మరి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో కామెంట్ చేయండి. 

News December 31, 2024

కోరుకొండ: రేవ్ పార్టీలో 19 మంది అరెస్ట్.. వివరాలివే

image

తూ.గో(D) కోరుకోండలోని రేవ్ పార్టీపై పోలీసుల దాడిలో మొత్తం 19మందిని అరెస్ట్ చేశారు. గుంటూరుకి చెందిన గోపాలకృష్ణ అనే వ్యక్తి ఫంక్షన్ హాల్ బుక్ చేసి పార్టీ నిర్వహించారు. ఇక్కడికి TNK, ఆచంట, గోపాలపురానికి చెందిన 10మంది ఎరువుల డీలర్లను రప్పించారు. కాకినాడకు చెందిన మహిళ ద్వారా ఐదుగురు అమ్మాయిలను తీసుకొచ్చారు. వారితో మద్యం తాగుతూ డ్యాన్స్ చేశారు. దీనిపై కేసు నమోదు చేసి నిందితుల్ని కోర్టులో హాజరుపర్చారు.