News April 14, 2025
పెదబయలు: కుక్క కాటుకు విద్యార్థి మృతి

పెదబయలు మండలంలో సోమవారం విషాదం నెలకొంది. గిన్నెలకోట పంచాయతీలోని గుండాలగరువు ఎంపీపీ పాఠశాలలో 4వతరగతి విద్యార్థి మఠం ఆదిత్యరామచంద్రపడాల్ కుక్కకాటుకు గురై విశాఖ కేజీహెచ్ చేరి చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మరణించాడు. నాలుగు నెలల క్రితం బాలుడికి కుక్కకాటు వేసిందని టీకాలు వేయకుండా నిర్లక్ష్యంతోనే రాబీస్ లక్షణాలతో మృతి చెందినట్లు కుంటుంబ సభ్యులు అన్నారు. తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.
Similar News
News December 3, 2025
మెదక్: 149 సర్పంచ్ స్థానాలకు 1007 నామినేషన్లు

మెదక్ జిల్లాలో 2వ విడతలో నామినేషన్ల స్వీకరణ రాత్రి వరకు కొనసాగింది. జిల్లాలోని 8 మండలాల్లో 149 సర్పంచ్ స్థానాలకు 1007 నామినేషన్లు వచ్చాయి. చేగుంట-188, మనోహరాబాద్-131, మెదక్-134, నార్సింగి-65, నిజాంపేట్-102, రామాయంపేట-126, చిన్నశంకరంపేట 185, తుప్రాన్-76 చొప్పున నామినేషన్లు సమర్పించారు. ఆలాగే 1,290 వార్డు స్థానాలకు 3,430 మంది నామినేషన్‌లు సమర్పించారు. నేటి నుంచి నామినేషన్ల పరిశీలన జరుగుతుంది.
News December 3, 2025
నల్గొండ: గ్రామ పంచాయతీలకు ఊరట..!

నల్గొండ జిల్లాలో పంచాయతీ ఎన్నికల పుణ్యమా అని బకాయిలు వసూళ్లు కావడంతో గ్రామ పంచాయతీలకు ఆదాయం పెరిగింది. పంచాయతీ ఎన్నికల్లో పోటీలో ఉండే అభ్యర్థులు ఇంటి పన్ను, నల్లా బకాయిలు చెల్లించి నామినేషన్ ఫారంకు రశీదు జతచేయాలని నిబంధన ఉండడం పంచాయతీలకు వరంగా మారింది. బకాయి బిల్లులు వసూలు కావడంతో పంచాయతీలకు కొంత ఊరట లభించింది. జిల్లా వ్యాప్తంగా 869 గ్రామ పంచాయతీలు ఉన్నాయి.
News December 3, 2025
పల్నాడులో పొలిటికల్ ఫైట్.. కాసు వర్సెస్ జూలకంటి.!

పల్నాడులో కాసు, జూలకంటి కుటుంబాల మధ్య పొలిటికల్ ఫైట్ జరుగుతోంది. రెండు కుటుంబాల మధ్య మొదట నుంచి రాజకీయ వైరం ఉంది ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర మాజీ సీఎం కాసు బ్రహ్మానంద రెడ్డి వారసుడిగా మహేశ్ రెడ్డి కొనసాగుతున్నారు. పల్నాటి పులిగా పేరు పొందిన జూలకంటి నాగిరెడ్డి వారసుడిగా బ్రహ్మానంద రెడ్డి ఉన్నారు. వైసీపీ, టీడీపీ మధ్య ప్రారంభమైన మాటల యుద్ధం పల్నాడుకు ఏ కుటుంబం ఏమి చేసింది అనే చర్చకు దారి తీసింది.


