News December 31, 2025

పెదబయలు: మత్స్యగెడ్డలో మహిళా డెడ్‌బాడీ కలకలం

image

పెదబయలు మండల కేంద్రం సమీపంలోని లకేపుట్టు ఏకలవ్య పాఠశాల వెనక ఉన్న మత్స్యగెడ్డలో ఓ మహిళ మృతదేహం కలకలం రేపింది. బుధవారం ఉదయం మృతదేహాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించగా..ఎస్సై వెంకటేష్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. సిబ్బందితో డెడ్ బాడీని బయటకు తీయించి ఆచూకీ కోసం గాలింపు చర్యలు మొదలుపెట్టారు. ఆమె ఫొటో ఆధారంగా వివరాలు తెలిస్తే 94409 04227 నంబర్‌కు సమాచారం అందించాలని ఎస్సై కోరారు.

Similar News

News February 13, 2026

BREAKING: హుస్నాబాద్ మున్సిపల్ పీఠం కాంగ్రెస్‌దే

image

మంత్రి పొన్నం ఇలాకా హుస్నాబాద్ మున్సిపాలిటీ పీఠం కాంగ్రెస్ గెలిచింది. ఇక్కడ 20 వార్డులకు గాను 14 వార్డులు కాంగ్రెస్ సాధించింది. 2 వార్డులు BRS గెలిచింది. మిగతా వార్డులకు సంబంధించి కౌంటింగ్ జరుగుతోంది. మ్యాజిక్ ఫిగర్ దాటడంతో కాంగ్రెస్ పీఠం దక్కించుకుంది. దీంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.

News February 13, 2026

జమ్మికుంట మున్సిపల్ కుర్చీకి తప్పని ‘ఎక్స్-అఫీషియో’ సెగ!

image

జమ్మికుంట మున్సిపాలిటీలో హంగ్ ఏర్పడటంతో స్వతంత్రులను తమ వైపు తిప్పుకునేందుకు ప్రధాన పార్టీలు పావులు కదుపుతున్నాయి. ఎక్స్-అఫీషియో ఓట్ల వినియోగం, స్వతంత్రుల మద్దతుపైనే జమ్మికుంట మున్సిపల్ పీఠం భవితవ్యం ఆధారపడి ఉంది. రేపటిలోపు రాజకీయ సమీకరణాలు ఏ మలుపు తిరుగుతాయోనని పట్టణ ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు.

News February 13, 2026

నలుగురి చేతిలో జమ్మికుంట భవితవ్యం..!

image

జమ్మికుంట మున్సిపాలిటీలో హంగు ఏర్పడడంతో BRS, కాంగ్రెస్ పార్టీలు స్వతంత్రులను తమ వైపు తిప్పుకునేందుకు పావులు కదుపుతున్నాయి. ముఖ్యంగా AIFB అభ్యర్థితో పాటు ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులకు రెండు పార్టీల నుంచి భారీ ఆఫర్లు అందుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒకరిద్దరు అభ్యర్థులు మద్దతు ఇచ్చినా సమీకరణాలు పూర్తిగా మారిపోయే అవకాశం ఉండటంతో జమ్మికుంట రాజకీయం ఇప్పుడు జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశమైంది.