News February 3, 2025
పెదబయలు సంతలో క్యారెట్ ధర పతనం

పెదబయలు మండల కేంద్రంలోని సోమవారం వారపు సంతలో క్యారెట్ ధర పతనమైంది. కొనుగోలుదారులు లేక రైతులు దిగాలు చెందారు. ఒడిశా ప్రాంతం నుంచి సంతకు అధికంగా వచ్చే కూరగాయల వ్యాపారస్థులు ప్రస్తుతం ధరలు పతనం అవ్వడంతో మరల వెనక్కి తీసుకెళ్లలేక తక్కువ ధరలకు విక్రయిస్తున్నారని వాపోతున్నారు. గత వారం రూ.1250 పలికిన బుట్ట క్యారెట్ ధర ఈ వారం రూ.900 నుంచి రూ.950 పలుకుతుందన్నారు.
Similar News
News March 13, 2025
SVSC ఐడియా ముందుగా ఆ హీరోకు చెప్పా: శ్రీకాంత్ అడ్డాల

వెంకటేశ్, మహేశ్ బాబు ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ బాక్సాఫీసు వద్ద హిట్‌గా నిలిచింది. ఈ సినిమా ఐడియాను ముందుగా నాగార్జునకు చెప్పినట్లు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తెలిపారు. స్క్రిప్ట్ రెడీ చేయాల్సి ఉందని చెప్పడంతో చూద్దామన్నట్లు తెలిపారు. అదే సమయంలో సురేశ్ బాబు, వెంకటేశ్ కథ విని ఒకే చేసినట్లు వెల్లడించారు. ఆ తర్వాత వెంకీ, మహేశ్ కాంబినేషన్ కుదిరిందన్నారు.
News March 13, 2025
ఈ రోజు నమాజ్ వేళలు

మార్చి 13, గురువారం
ఫజర్: తెల్లవారుజామున 5.14 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6.26 గంటలకు
దుహర్: మధ్యాహ్నం 12.26 గంటలకు
అసర్: సాయంత్రం 4.45 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6.26 గంటలకు
ఇష: రాత్రి 7.38 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News March 13, 2025
వరంగల్ మార్కెట్లో మిర్చి ఉత్పత్తుల ధరలు ఇలా.!

వరంగల్ నగరంలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో అరుదైన మిర్చి ఉత్పత్తుల ధరలు ఇలా ఉన్నాయి. దీపిక మిర్చి క్వింటాకి రూ.16,500 పలకగా, 5531 రకం మిర్చికి రూ. 11,000 ధర వచ్చింది. అలాగే 1048 మిర్చికి రూ.11 వేలు, టమాటా మిర్చికి రూ.32వేలు, సింగిల్ పట్టి మిర్చికి రూ.37000 ధర వచ్చినట్లు వ్యాపారులు పేర్కొన్నారు.